ఐపీఎల్ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీకి షాక్... వన్డే నెం. 1 బ్యాట్స్‌మెన్‌గా బాబర్ ఆజమ్..

By team teluguFirst Published Apr 8, 2021, 2:43 PM IST
Highlights

దాదాపు 1258 రోజులుగా వన్డేల్లో టాప్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ...

 దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్...

దాదాపు 1258 రోజులుగా వన్డేల్లో టాప్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న భారత సారథి విరాట్ కోహ్లీ ఆధిపత్యానికి బ్రేక్ పడింది. ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ స్థానాన్ని పాక్ యంగ్ సెన్సేషన్ బాబర్ ఆజమ్ ఆక్రమించాడు.

సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లాడు... విండీస్ మాజీ లెజెండ్ వీవ్ రిచర్డ్స్ (1748 రోజులు) తర్వాత అత్యధిక రోజులు వన్డే ర్యాంకింగ్స్‌లో ఎక్కువ రోజులు ఉన్న ప్లేయర్‌గా రెండో స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ.

ఏబీ డివిల్లియర్స్ 871 రోజుల పాటు టాప్‌లో ఉండి, మూడో స్థానంలో నిలిచాడు. 2003లో పాక్ మాజీ ప్లేయర్ల మహ్మద్ యూసఫ్ తర్వాత వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌ని దక్కించుకున్న పాక్ ప్లేయర్‌గా నిలిచాడు బాబర్ ఆజమ్. బాబర్ ఆజమ్ టాప్‌లో వెళ్లడంతో కోహ్లీ రెండో స్థానానికి పడిపోగా, రోహిత్ శర్మ మూడో స్థానానికి పడిపోయాడు.

click me!