రిషబ్ పంత్ మరో చెత్త ప్రదర్శన: సెటైర్లు వేస్తున్న నెటిజన్లు

Published : Feb 29, 2020, 03:01 PM IST
రిషబ్ పంత్ మరో చెత్త ప్రదర్శన: సెటైర్లు వేస్తున్న నెటిజన్లు

సారాంశం

న్యూజిలాండ్ పై జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో చెత్త ప్రదర్శన చేసిన రిషబ్ పంత్ ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. కేవలం 12 పరుగులు మాత్రమే చేసి రిషబ్ పంత్ పెవిలియన్ చేరుకున్న విషయం తెలిసిందే.

క్రైస్ట్ చర్చ్: న్యూజిలాండ్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో చెత్త ప్రదర్శన చేసిన టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ ను నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో అతన్ని ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టారు. శనివారం న్యూజిలాండ్ పై ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ 22 ఏళ్ల పృథ్వీ షా బ్యాట్ తో పేలవమైన ప్రదర్శన చేశాడు. 

 

14 బంతులు ఆడి 12 పరుగులు చేసిన రిషబ్ పంత్ అత్యంత చెత్తగా అవుటయ్యాడు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ భారత్ ను బ్యాటింగ్ కు దింపింది. రిషబ్ పంత్ ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. భారత్ స్కోరు పెంచడానికి ప్రయత్నిస్తాడని భావించిన పంత్ చేతులెత్తేశాడు. తొలుత రెండు సార్లు అవుటయ్యే ప్రమాదాలను తప్పించుకున్నాడు. చివరకు జెమీషన్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

 

రిషబ్ పంత్ పై నెటిజన్లు ఘోరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరకు ఇండియా 242 పరుగులకు తన తొలి ఇన్నింగ్సును ముగించింది. పృథ్వీ షా 54 పరుగులు చేయగా ఛతేశ్వర్ పుజారా కూడా 54 పరుగులు చేశాడు. హనమ విహారి 55 పరుగులు చేశాడు. ఈ ముగ్గురు తప్ప న్యూజిలాండ్ బౌలర్లకు ఎదురు నిలిచిన భారత్ బ్యాట్స్ మన్ మరొకరు లేరు. జెమీషన్ ఐదు వికెట్లు తీసి భారత్ వెన్ను విరిచాడు. 

 

ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్సును ప్రారంభించి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. టామ్ లాథమ్ 27 పరుగులతో, బ్లండెల్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.

 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !