
భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. నేటి మ్యాచ్ ద్వారా ఆల్‌రౌండర్ దీపక్ హుడా, టీ20ల్లో ఆరంగ్రేటం చేయబోతున్నాడు. విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన దీపక్ హుడా, గాయపడిన సూర్యకుమార్ యాదవ్ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే అవకాశం ఉంది.
కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్క పరాజయం లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు రోహిత్ శర్మ. కొంత కాలంగా సరైన ఫామ్‌లో లేని శ్రీలంక జట్టు, రోహిత్ సేన జోరును అడ్డుకోవడం దాదాపు అసాధ్యమే. అయితే శ్రీలంక టూర్‌లో భారత బృందంలో కరోనా కేసులు వెలుగు చూడడంతో రిజర్వు బెంచ్ ప్లేయర్లతో కూడిన జట్టును ఓడించి, టీ20 సిరీస్ గెలిచింది లంక జట్టు...
లంకలో పర్యటించిన జట్టుతో పోలిస్తే, ఈ సిరీస్‌లో బరిలో దిగే భారత జట్టులో చాలా మార్పులు ఉన్నాయి. కీలక ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. అదీకాకుండా వరుసగా 9 మ్యాచుల్లో విజయాలు అందుకున్న రోహిత్ సేనను ఓడించడం అంత తేలికయ్యే విషయం కాదు...
విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో స్లో స్ట్రైయిక్ రేటు కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఇషాన్ కిషన్‌కి మరో అవకాశం ఇచ్చాడు రోహిత్ శర్మ. మూడో టీ20 మ్యాచ్‌లో కనిపించిన యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కి మరోసారి నిరాశే ఎదురైంది...
శ్రీలంక టూర్‌లో కనిపించిన భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్, మళ్లీ లంకతో సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో గాయపడి దాదాపు నాలుగు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్న భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా... శ్రీలంకతో టీ20 సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు...
విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చిన యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్‌ని పక్కనబెట్టిన రోహిత్ శర్మ అండ్ కో... యజ్వేంద్ర చాహాల్‌కి స్పిన్నర్‌గా జట్టులో చోటు దక్కింది...
విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ వంటి కీ ప్లేయర్లు లేకుండా టీ20 సిరీస్ ఆడుతోంది భారత జట్టు. రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, చాహాల్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ వంటి సీనియర్లు ఈ సిరీస్‌లో ఏ విధంగా రాణిస్తారనేది కీలకంగా మారనుంది.
వరుస అవకాశాలు ఇచ్చినా సరిగా నిరూపించుకోలేక జట్టులోకి వస్తూ పోతూ ఉన్న వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కి ఈ టీ20 సిరీస్ చాలా ముఖ్యం. ఈ సిరీస్‌లో ఫెయిల్ అయితే శాంసన్‌కి మరో అవకాశం దక్కడానికి చాలా కాలం పట్టొచ్చు...
భారత జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, యజ్వేంద్ర చాహాల్
శ్రీలంక జట్టు: పథుమ్ నిశ్శంక, కమిల్ మిశారా, చరిత్ అసలంక, దినేశ్ చండిమల్, జనిత్ లియనాగే, దసున్ శనక, చమికా కరుణరత్నే, జెఫ్రే వందర్సే, ప్రవీణ్ జయవిక్రమ, దుస్మంత చమీరా, లహీరు కుమార