
ర్లాండ్ టూర్‌లో జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానుంది. డబ్లిన్‌లో బుధవారం ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో టాస్‌ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు. వర్షం తగ్గకుండా మ్యాచ్ రద్దు అయితే టీమిండియా 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుంది.
అయితే ఆసియా కప్ 2023 టోర్నీ ప్రారంభానికి ముందు ఇది ఆఖరి మ్యాచ్. ఆసియా కప్ టోర్నీకి ఎంపికైన తిలక్ వర్మ, తొలి రెండు టీ20 మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. నేటి మ్యాచ్‌లో అతని పర్ఫామెన్స్, తనకు అదనపు బలాన్ని ఇవ్వడం గ్యారెంటీ. ఐర్లాండ్ టూర్‌లో ఉన్న జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, తిలక్ వర్మ, సంజూ శాంసన్... స్వదేశానికి రాగానే నేరుగా బీసీసీఐ క్యాంపులో పాల్గొనబోతున్నారు..
జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ తొలి రెండు మ్యాచుల్లో చక్కని బౌలింగ్ పర్ఫామెన్స్ చూపించారు. రెండో టీ20లో బ్యాటింగ్‌కి వచ్చిన రింకూ సింగ్, తన ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్‌తో మంచి ఎంట్రీ దక్కించుకున్నాడు. ఆసియా క్రీడలకు ఎంపికైన జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న రుతురాజ్ గైక్వాడ్ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు..
అయితే ఆసియా క్రీడల్లో భారత ప్రధాన ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మాత్రం బౌలింగ్‌లో మునుపటి మెరుపులు చూపించలేకపోతున్నాడు. తన షార్ట్ ఇంటర్నేషనల్ కెరీర్‌లో ఇప్పటికే 16 నో బాల్స్ వేసిన అర్ష్‌దీప్ సింగ్, టీ20ల్లో అత్యధిక నో బాల్స్ వేసిన భారత బౌలర్‌గా టాప్‌లో నిలిచాడు. నేటి మ్యాచ్‌లో అతని నుంచి మెరుగైన ప్రదర్శన రావాల్సిన అవసరం ఉంది..
శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్‌రౌండర్లకు మొదటి రెండు టీ20ల్లో పెద్దగా అవకాశం రాలేదు. రెండో టీ20లో ఆఖరి ఓవర్‌లో 2 సిక్సర్లు బాదిన శివమ్ దూబే, ప్రధాన జట్టులో చోటు కోసం ప్రయత్నించాలంటే ఓ భారీ ఇన్నింగ్స్ ఆడి తీరాల్సిందే..