ఆఫ్ఘాన్‌కి చుక్కలు చూపించిన పాక్ ఫాస్ట్ బౌలర్లు.. 59 పరుగులకే ఆలౌట్! 5 వికెట్లు తీసిన హారీస్ రౌఫ్...

Published : Aug 23, 2023, 05:09 PM ISTUpdated : Aug 23, 2023, 05:13 PM IST
ఆఫ్ఘాన్‌కి చుక్కలు చూపించిన పాక్ ఫాస్ట్ బౌలర్లు.. 59 పరుగులకే ఆలౌట్! 5 వికెట్లు తీసిన హారీస్ రౌఫ్...

సారాంశం

201 పరుగులకి ఆలౌట్ అయిన పాకిస్తాన్, అయినా 142 పరుగుల తేడాతో పాకిస్తాన్‌కి భారీ విజయం... 5 వికెట్లు తీసి ఆఫ్ఘాన్‌కి 59 పరుగులకే ఆలౌట్ చేసిన హారీస్ రౌఫ్... 

ప్రస్తుత క్రికెట్‌లో భీకరమైన ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఉన్న జట్లలో పాకిస్తాన్ ఒకటి. షాహీన్ షా ఆఫ్రిదీ, హారీస్ రౌఫ్ వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు పాకిస్తాన్‌ టీమ్‌కి ప్రధాన బలం.  తాజాగా శ్రీలంకలో ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్, తొలి వన్డేలో ఘన విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 47.1 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయినా 142 పరుగుల తేడాతో పాకిస్తాన్‌కి భారీ విజయం దక్కిందంటే పాక్ బౌలర్లు, ఆఫ్ఘాన్ బ్యాటర్లను ఎంతలా ఇబ్బంది పెట్టారో అర్థం చేసుకోవచ్చు..

ఫకార్ జమాన్ 2 పరుగులు చేసి అవుట్ కాగా ఐసీసీ నెం.1 వన్డే బ్యాటర్ బాబర్ ఆజమ్ 3 బంతులు ఆడి ముజీబ్ వుర్ రహీం బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇమామ్ ఉల్ హక్ 94 బంతుల్లో 2 ఫోర్లతో 61 పరుగులు చేయగా మహ్మద్ రిజ్వాన్ 22 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేశాడు. ఆఘా సల్మాన్ 7, ఇఫ్తికర్ అహ్మద్ 30, షాదబ్ ఖాన్ 39, ఉసమా మిర్ 2, షాహీన్ ఆఫ్రిదీ 2, హారీస్ రౌఫ్ 1 పరుగు చేసి అవుట్ కాగా 10వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన షాదబ్ ఖాన్ 27 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసి  నాటౌట్‌గా నిలిచాడు..

పాకిస్తాన్ చేసిన 201 పరుగుల్లో 18 పరుగులు, ఆఫ్ఘాన్ బౌలర్లు వైడ్ల రూపంలో ఇవ్వడం విశేషం. ఆఫ్ఘాన్ బౌలర్లు ముజీబ్ వుర్ రహీమ్ 3 వికెట్లు తీయగా మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు తీశారు. ఫజల్‌హక్ ఫరూకీ, రెహ్మత్ షాలకు తలా ఓ వికెట్ దక్కింది..

202 పరుగుల లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 19.2 ఓవర్లలో 59 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇబ్రహీం జద్రాన్, రెహ్మత్ షా, హస్మతుల్లా షాహిదీ వరుసగా డకౌట్ అయ్యారు. 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘాన్. ఇమ్రాన్ అలికిల్ 4, మహ్మద్ నబీ 7 పరుగులు చేసి అవుట్ కాగా రషీద్ ఖాన్‌ని హరీస్ రౌఫ్ డకౌట్ చేశాడు. అబ్దుల్ రహ్మాన్ 2, ముజీబ్ వుర్ రహీమ్ 4 పరుగులు చేయగా ఓపెనర్ రెహ్మానుల్లా గుర్భాజ్ 47 బంతుల్లో 18 పరుగులు, అజ్మతుల్లా ఓమర్‌జాయ్ 12 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసి సింగిల్ డిజిట్ స్కోరు దాటిన ఆఫ్ఘాన్ బ్యాటర్లుగా నిలిచారు..

ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్‌లో 5 బౌండరీలు మాత్రమే ఉండగా అందులో 3 బౌండరీలు కొట్టిన అజ్మతుల్లా ఓమర్‌జాయ్... బౌన్సర్ దెబ్బకు రిటైర్ హార్ట్‌గా పెవిలియన్ చేరడం విశేషం.  హారీస్ రౌఫ్ 6.2 ఓవర్లలో 2 మెయిడిన్లతో 18 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. షాహీన్ ఆఫ్రిదీ 4 ఓవర్లలో 2 మెయిడిన్లతో 9 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. షాదబ్ ఖాన్, నసీం షాలకు తలా ఓ వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రేపు (ఆగస్టు 24) జరగనుంది.

PREV
click me!

Recommended Stories

Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !
Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు