INDvsIRE 2nd T20I: టాస్ గెలిచిన ఐర్లాండ్... సిరీస్‌పైన కన్నేసిన టీమిండియా..

Published : Aug 20, 2023, 07:04 PM ISTUpdated : Aug 20, 2023, 07:20 PM IST
INDvsIRE 2nd T20I: టాస్ గెలిచిన ఐర్లాండ్... సిరీస్‌పైన కన్నేసిన టీమిండియా..

సారాంశం

India vs Ireland 2nd T20I: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఐర్లాండ్.. మార్పులు లేకుండా బరిలో దిగుతున్న ఇరు జట్లు... 

టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇరు జట్లు కూడా నేటి మ్యాచ్‌లో గత మ్యాచ్‌లో ఆడిన జట్లనే కంటిన్యూ చేస్తున్నాయి. రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఆవేశ్ ఖాన్‌, నేటి మ్యాచ్‌లో కూడా రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు.

వర్షం కారణంగా అంతరాయం కలిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 2 పరుగుల తేడాతో నెగ్గింది భారత జట్టు. 11 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా, మొదటి ఓవర్‌లోనే 2 వికెట్లు తీసి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ కూడా 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు..

అయితే అర్ష్‌దీప్ సింగ్, ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు సమర్పించి చెత్త రికార్డు నెలకొల్పాడు. మొదటి మ్యాచ్‌‌లో టీమిండియా 6.5 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయడంతో బ్యాటర్లకు పెద్దగా నిరూపించుకునే అవకాశం రాలేదు. యశస్వి జైస్వాల్‌కి మంచి ఆరంభం దక్కినా భారీ స్కోరుగా మలచడంలో ఫెయిల్ అయ్యాడు..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి బ్యాకప్ ప్లేయర్‌గా భావిస్తున్న తిలక్ వర్మ, గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీల్లో తిలక్ వర్మకు చోటు ఉండాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి తీరాల్సిందే..

సీనియర్ స్పిన్నర్లు యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్‌కి దూరంగా ఉండడంతో రవి భిష్ణోయ్, తొలి టీ20లో పూర్తి కోటా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్ 3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు. 

టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయబోతుండడంతో బ్యాటింగ్ డెప్త్ ఏంటో తెలియనుంది. ఆసియా క్రీడల్లో భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న రుతురాజ్ గైక్వాడ్‌, ఇప్పటిదాకా అంతర్జాతీయ క్రికెట్‌లో నిరూపించుకోలేకపోయాడు. అతని ఐపీఎల్ ట్రాక్ రికార్డు, దేశవాళీ టోర్నీల్లో పర్ఫామెన్స్ కారణంగానే టీమిండియాకి కెప్టెన్సీ చేసే ఛాన్స్ కొట్టేశాడు..

ఐర్లాండ్ టూర్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకునే ఇన్నింగ్స్ ఆడితే... ఆసియా క్రీడలకు ముందు అతని ఆత్మవిశ్వాసం డబుల్ అవుతుంది. అలాగే యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్ కూడా ఆసియా క్రీడల్లో టీమిండియా తరుపున ఆడబోతున్నారు.

ఐర్లాండ్‌పై అదిరిపోయే రికార్డు ఉన్న సంజూ శాంసన్, గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి రాగానే వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. వెస్టిండీస్ టూర్‌లో పేలవ ప్రదర్శనతో ఫ్యాన్స్‌ని నిరాశపరిచిన సంజూ శాంసన్, మళ్లీ టీమ్‌లో చోటు కోల్పోకుండా ఉండాలంటే నేటి మ్యాచ్‌లో బ్యాటుకి పని చెప్పాల్సిందే.

ఐర్లాండ్ జట్టు: ఆండ్రూ బాల్బిరీన్, పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), లోర్కన్ టక్కర్, హరీ టెక్టర్, కర్టీస్ కాంపర్, జార్జ్ డాక్‌రెల్, మార్క్ అదైర్, బెర్రీ మెక్‌కార్తీ, క్రెగ్ యంగ్, జోషువా లిటిల్, బెంజమిన్ వైట్ 

భారత జట్టు: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రిత్ బుమ్రా (కెప్టెన్), రవి భిష్ణోయ్

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?