మరోసారి వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్పెషల్ రిక్వెస్ట్...

Published : Aug 20, 2023, 04:29 PM IST
మరోసారి వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్పెషల్ రిక్వెస్ట్...

సారాంశం

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 9న న్యూజిలాండ్ vs నెదర్లాండ్స్  మ్యాచ్‌, ఆ తర్వాతి రోజు పాకిస్తాన్ vs శ్రీలంక మ్యాచ్... వెంటవెంటనే మ్యాచులతో సెక్యూరిటీ సమస్యలు వస్తాయంటూ.. 

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదలైన తర్వాత నవరాత్రుల కోసం 9 మ్యాచులను రీషెడ్యూల్ చేసింది ఐసీసీ. అయితే మరోసారి వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సిందిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ, ఐసీసీలను కోరింది.

అక్టోబర్‌లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో హైదరాబాద్‌లో కేవలం 3 వరల్డ్ కప్ మ్యాచులు మాత్రమే జరుగుతున్నాయి. అందులో రెండు మ్యాచులు పాకిస్తాన్‌వి కాగా మరో మ్యాచ్ న్యూజిలాండ్‌ది. అక్టోబర్ 9న న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌, ఆ తర్వాతి రోజు పాకిస్తాన్ vs శ్రీలంక మ్యాచులు, హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగబోతున్నాయి.

తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే అక్టోబర్ 12న పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరగాల్సింది. అలాగే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అదే రోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతుండడంతో ఆ మ్యాచ్‌‌ని అక్టోబర్ 14కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ.  

దీంతో అక్టోబర్ 12న హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడి, 13న అహ్మదాబాద్‌కి వెళ్లి.. తర్వాతి రోజే టీమిండియాతో మ్యాచ్ ఆడడం కష్టమని పాకిస్తాన్ అభ్యంతరం చెప్పవచ్చు. ఈ ఉద్దేశంతోనే అక్టోబర్ 12న జరగాల్సిన మ్యాచ్‌ని  అక్టోబర్ 10కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ. 

అయితే వెంటవెంటనే రెండు మ్యాచులు నిర్వహించాల్సి రావడం వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తవచ్చని హైదరాబాద్ పోలీసు డిపార్ట్‌‌మెంట్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి తెలియచేసిందట..

‘మేం బీసీసీఐ దృష్టికి ఈ విషయాన్ని తెలియచేశాం. ముందు ప్రకటించిన తేదీల్లో మార్పులు చేయడం వల్ల వెంటవెంటనే మ్యాచులు నిర్వహించాల్సి వస్తోంది. రెండు మ్యాచుల మధ్య కనీసం ఒక్క రోజైనా ఉండే బాగుండేది. బీసీసీఐ సీఈవో హేమాంగ్ ఆమిన్‌తో ఈ విషయం గురించి మాట్లాడాం. షెడ్యూల్‌లో మార్పులు జరుగుతాయేమో చూడాలి. లేదంటే మాత్రం ఇక సర్దుకుని మ్యాచులు పెట్టాల్సిందే..’ అంటూ కామెంట్ చేశాడు ఓ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారి..

అయితే పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, నెదర్లాండ్స్ వంటి టీమ్స్ ఆడే మ్యాచులు చూసేందుకు వెళ్లే క్రికెట్ ఫ్యాన్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అదీకాకుండా పాకిస్తాన్‌కి ఇండియాలో ఫ్యాన్స్ సపోర్ట్ దక్కడం చాలా తక్కువ. ఎవరైనా పాక్ నుంచి మ్యాచులు చూసేందుకు హైదరాబాద్‌ రావాలి? లేదా హైదరాబాద్‌లో ఉన్న పాక్ సపోర్టర్లు ఎవ్వరైనా స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడాలి..

లేదా ఖాళీగా ఉండి, మ్యాచులు చూడాలనుకునేవాళ్లు స్టేడియానికి వెళ్లి కాలక్షేపం చేయాలి. సోమవారం, మంగళవారం జరిగే ఈ మ్యాచులను చూసేందుకు జనాలు పెద్దగా రాకపోవచ్చు. ఏదో ఇండియా ఆడే మ్యాచులు ఉన్నట్టుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వెంటవెంటనే రెండు మ్యాచులు పెట్టేందుకు ఇంత కంగారు పడడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే.. 
 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?