INDvsENG 4th Test: రవీంద్ర జడేజా, ఆ వెంటనే రహానే అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా...

By Chinthakindhi RamuFirst Published Sep 5, 2021, 4:31 PM IST
Highlights

296 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టు... రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చినా సక్సెస్ కాలేకపోయిన రవీంద్ర జడేజా, అజింకా రహానే...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో సెషన్‌లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 270/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు, రవీంద్ర జడేజా వికెట్ త్వరగా కోల్పోయింది. 59 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన జడేజా, క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యారు...

జడేజా రివ్యూకి వెళ్లినా, ఫలితం దక్కలేదు. 296 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన జడేజా రెండుసార్లు నిరాశపరిచాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీతో కలిసి నాలుగో వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం జోడించి, పర్వాలేదనిపించాడు జడ్డూ. 

నాలుగో రోజు బౌలింగ్‌కి వచ్చిన మొదటి ఓవర్‌లోనే వికెట్ తీశాడు క్రిస్ వోక్స్. జడ్డూ అవుటైన తర్వాత రెండో బంతికే అజింకా రహానేని ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించాడు ఫీల్డ్ అంపైర్. అయితే రివ్యూకి వెళ్లిన టీమిండియాకి అనుకూలంగా ఫలితం దక్కింది. బంతి వికెట్ల పైనుంచి వెళ్తుండడంతో రహానే బతికిపోయాడు...

అయితే ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయిన అజింకా రహానే, 8 బంతులాడి క్రిస్ వోక్స్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 296 పరుగుల వద్దే రెండు వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

ప్రస్తుతం ఇంగ్లాండ్‌కి 197 పరుగుల ఆధిక్యంలో ఉంది టీమిండియా. పిచ్ బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తుండడంతో కనీసం 300+ పరుగుల లక్ష్యం ఇంగ్లాండ‌ ముందు పెడితే, వారిని నిలువరించేందుకు బౌలర్లకు తేలికవుతుంది.

click me!