ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియాకి షాక్... హెడ్‌కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్...

By Chinthakindhi RamuFirst Published Sep 5, 2021, 3:57 PM IST
Highlights

నాలుగో టెస్టు నాలుగో రోజు ఆరంభానికి ముందే రవిశాస్త్రికి కరోనా పాజిటివ్... హెడ్ కోచ్‌తో పాటు సహాయక సిబ్బంది ఐసోలేషన్‌లోకి... ఇప్పటికే వ్యాక్సినేషన్ కోర్సు పూర్తిచేసుకున్న శాస్త్రి...

ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. భారత జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడ్డాడు. నాలుగో టెస్టు నాలుగో రోజు ఆరంభానికి ముందే రవిశాస్త్రికి కరోనా సోకినట్టు తెలిపింది బీసీసీఐ... ఈ కారణంగానే రవిశాస్త్రి, నాలుగో టెస్టు నాలుగో రోజు స్టేడియంలో ఎక్కడా కనిపించలేదు...

రవిశాస్త్రితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌తో పాటు ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్‌లను ఐసోలేషన్‌కు తరలించారు. రవిశాస్త్రితో ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న భారత ప్లేయర్లు అందరూ కరోనా రెండు డోసుల కోర్సు పూర్తిచేసుకున్నారు. అయినా శాస్త్రికి పాజిటివ్ రావడం విశేషం.

శనివారం రాత్రి, ఆదివారం ఉదయం కరోనా పరీక్షల్లో పాల్గొన్న భారత క్రికెటర్లకు నెగిటివ్ రావడం, కోచ్ రవిశాస్త్రితో వారికి క్లోజ్ కాంటాక్ట్ లేకపోవడంతో ఆటకు ఎలాంటి అంతరాయం కలగలేదు.

శ్రీలంక టూర్‌లో భారత జట్టును కరోనా తెగ ఇబ్బంది పెట్టింది. భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా బారిన పడడంతో అతని మరో 8 మంది ప్లేయర్లు క్లోజ్ కాంటాక్ట్ ఉండడంతో 9 మంది కీ ప్లేయర్లు లేకుండా ఆఖరి రెండు టీ20 మ్యాచులు ఆడి, వాటిలో చిత్తుగా ఓడింది భారత జట్టు... 

click me!