INDvsENG: లార్డ్స్‌ని వదలని వర్షం... మొదటి రోజే సహకరించని వాతావరణం...

By Chinthakindhi RamuFirst Published Aug 12, 2021, 3:11 PM IST
Highlights

లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు... తొలిరోజే వర్షం ఆటంకం... వర్షం కారణంగా టాస్ ఆలస్యం...

తొలి టెస్టును ఫలితం తేలకుండా చేసిన వర్షం... రెండో టెస్టును వదిలిపెట్టేలా కనిపించడం లేదు. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఆకాశం మబ్బులతో కమ్ముకుని ఉండడంతో నేడు మ్యాచ్ ప్రారంభమైనా, సజావుగా సాగడం అనుమానంగానే మారింది...

తొలి టెస్టులో వర్షం కారణంగా విజయం అందుకోకపోయినా నాలుగు రోజుల పాటు ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిక్యం చూపించింది భారత జట్టు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చింది...
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ గాయంతో బాధపడుతున్నాడు.

నేటి మ్యాచ్‌లో అతను బరిలో దిగడం లేదు. అలాగే ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా గాయంతో టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ తీయలేకపోయిన స్టువర్ట్ బ్రాడ్... రెండో ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్‌ను అవుట్ చేసి టీమిండియాకి షాక్ ఇచ్చాడు.  

డబ్ల్యూటీసీ ఫైనల్ దగ్గర్నుంచి వరుసగా మూడో టెస్టులోనూ ఆటకు వర్షం ఆటంకం కలిగిస్తుండడంతో ఇంగ్లాండ్‌లో మ్యాచులు పెట్టకండి... అంటూ డిమాండ్లు చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

click me!