INDvsENG 2nd Test: అడ్డుగోడగా నిలబడిన జో రూట్, బెయిర్‌స్టో... నిరాశపర్చిన భారత బౌలర్లు...

Published : Aug 14, 2021, 05:43 PM IST
INDvsENG 2nd Test: అడ్డుగోడగా నిలబడిన జో రూట్, బెయిర్‌స్టో... నిరాశపర్చిన భారత బౌలర్లు...

సారాంశం

లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసిన ఇంగ్లాండ్... భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 148 పరుగుల దూరంలో ఆతిథ్య జట్టు... మరోసారి సెంచరీ దిశగా సాగుతున్న జో రూట్...

ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు కూడా భారీ స్కోరు దిశగా సాగుతోంది. మూడో రోజు ఉదయం సెషన్‌లో ఒక్క వికెట్ కోల్పోకుండా 97 పరుగులు జోడించింది ఇంగ్లాండ్ జట్టు. లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది ఇంగ్లాండ్. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 148 పరుగుల దూరంలో ఉంది ఇంగ్లాండ్ జట్టు.

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, టెస్టుల్లో 51వ సారి 50+ స్కోరును అందుకోగా... బెయిర్ స్టో రెండేళ్ల తర్వాత హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు... నాలుగో వికెట్‌కి అజేయంగా 108 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదుచేసిన జో రూట్, బెయిర్ స్టో కారణంగా లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది ఇంగ్లాండ్.

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 171 బంతుల్లో 9 ఫోర్లతో 89 పరుగులు చేయగా... జానీ బెయిర్ స్టో 91 బంతుల్లో 6 ఫోర్లతో 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. చివరిసారిగా 2019 ఆగస్టులో ఆస్ట్రేలియాపై లార్డ్స్ మైదానంలోనే హాఫ్ సెంచరీ చేసిన జానీ బెయిర్‌స్టో... రెండేళ్ల తర్వాత తొలిసారి టెస్టుల్లో 50+ స్కోరు చేశాడు. వికెట్ టేకర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనబెట్టి బరిలో దిగిన టీమిండియా... భారీ మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా
విదేశీ లీగ్‌ల్లో ఆడనున్న రో-కో.. ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే.?