పీకల్లోతు కష్టాల్లో టీమిండియా... 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రోహిత్ సేన...

Published : Mar 01, 2023, 10:16 AM ISTUpdated : Mar 01, 2023, 10:35 AM IST
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా...  45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రోహిత్ సేన...

సారాంశం

36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా... భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్న ఆస్ట్రేలియా స్పిన్నర్లు! మరోసారి మూడు రోజుల్లోనే ముగియనున్న టెస్టు?

ఇండోర్ టెస్టులో టీమిండియా మొదటి 11.2 ఓవర్లలోనే 5వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ తొలి బంతికే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు రోహిత్ శర్మ. తొలి బంతికే స్టార్క్ బౌలింగ్‌లో రోహిత్ బ్యాటుని తాకుతూ వెళ్లిన బంతి, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది.. అయితే అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడం, ఆస్ట్రేలియా రివ్యూ తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో రోహిత్‌కి లైఫ్ దక్కింది...

అదే ఓవర్ నాలుగో బంతికి ఎల్బీడబ్ల్యూ అవుట్ కోసం అప్పీలు చేసింది ఆస్ట్రేలియా. అయితే ఈసారి కూడా అంపైర్ నాటౌట్‌గా ఇచ్చాడు. ఆస్ట్రేలియా డీఆర్‌ఎస్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో తొలి నాలుగు బంతుల్లో రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు రోహిత్ శర్మ. ఐదో బంతికి ఫోర్ బాది ఖాతా తెరిచిన రోహిత్ శర్మ, తనకి వచ్చిన లైఫ్‌లను సరిగ్గా వాడుకోలేకపోయాడు..

23 బంతుల్లో 3 ఫోర్లతో 12 పరుగులు చేసిన రోహిత్ శర్మ, మ్యాట్ కుహ్నేమన్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ముందుకి వచ్చి స్టంపౌట్ అయ్యాడు. కుహ్నేమన్ వేసిన తొలి ఓవర్‌లో మొదటి నాలుగు బంతులను ఫేస్ చేయడానికి తెగ ఇబ్బందిపడిన రోహిత్, ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్ ఆడేందుకు యత్నించి పెవిలియన్ చేరాడు...

తొలి ఇన్నింగ్స్‌లో స్టంపౌట్ ద్వారా రోహిత్ శర్మ అవుట్ కావడం రెండోసారి. ఇంతకుముందు 2019లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో రోహిత్ శర్మ ఇలాగే తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికి టీమిండియా స్కోరు 317 పరుగులు. నేటి మ్యాచ్‌లో 27 పరుగులకే రోహిత్ అవుట్ అయ్యాడు.


ఆ తర్వాత 18 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ కూడా మ్యాట్ కుహ్నేమన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వత ఛతేశ్వర్ పూజారా, నాథన్ లియాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 4 బంతులు ఆడిన పూజారా, 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఛతేశ్వర్ పూజారా అవుట్ కావడం ఇదే 12వ సారి.. 

36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రవీంద్ర జడేజా, నాథన్ లియాన్ బౌలింగ్‌లో మ్యాట్ కుహ్నేమన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా శ్రేయాస్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. కుహ్నేమన్ బౌలింగ్‌లో అయ్యర్ బ్యాటుకి తాగిన బంతి, నేరుగా వెళ్లి వికెట్లను తాకింది. దీంతో 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

ఆట ప్రారంభమైన గంటలోనే భారత జట్టు సగం వికెట్లు కోల్పోవడంతో ఈ మ్యాచ్ కూడా మూడు రోజుల్లోనే ముగిసేలా కనిపిస్తోంది. మొదటి రోజు తొలి సెషన్‌లో స్పిన్‌కి ఇంతలా అనుకూలిస్తున్న ఇండోర్ పిచ్‌ మీద రెండు రోజుల పాటు ఆట సాగడం కూడా కష్టమేనని అంచనా వేస్తున్నారు అభిమానులు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర