టీమిండియా మహిళా క్రికెటర్‌కు తప్పని వేధింపులు...ఆకతాయికి ఆమె జవాబిదే

Published : May 13, 2019, 03:17 PM ISTUpdated : May 13, 2019, 03:20 PM IST
టీమిండియా మహిళా క్రికెటర్‌కు తప్పని వేధింపులు...ఆకతాయికి ఆమె జవాబిదే

సారాంశం

సామాన్య మహిళలే కాదు తమ అద్భుతమైన ప్రతిభతో  స్టార్ హోదాను  సంపాదించుకున్న మహిళామణులకు సైతం ఆకతాయిల వేధింపులు తప్పడం లేదు. కొందరు స్వయంగా వేధించబడగా మరికొందరు సోషల్ మీడియా వంటి మాధ్యమాల ద్వారా వేధింపులకు గురవుతున్నారు. కొందరు ఆకతాయిలు మరో ముందడుగేసి బహిరంగంగానే మహిళ సెటబ్రెటీలపై అనుచితంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి అనుభవమే  టీమిండియా మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ కు ఎదురయ్యింది. సోషల్ మీడియా ద్వారా తనను ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నించిన ఓ ఆకతాయికి ఆమె  తనదైన స్టైల్లో జవాభిచ్చింది. 

ఇటీవల జరిగిన మహిళా  టీ20 చాలెంజ్ టోర్నీలో రోడ్రిగ్యూస్ ఆకట్టుకుంది. సూపర్‌ నోవాస్ తరపున ప్రాతినిధ్యం వహించిన ఆమె జట్టు గెలుపులో ముఖ్య పాత్ర పోషించింది. గత గురువారం జరిగిన మ్యాచ్ లో తనదైన షాట్లతో చెలరేగుతూ అభిమానులను ఆకట్టుకుంది.  

అయితే ఈ మ్యాచ్ అనంతరం రోడ్రిగోస్ ను ట్విట్టర్లో ఓ అభిమాని సందేశం పంపించాడు. అద్భుతంగా  ఆమెను పొగుడుతూనే ప్లర్ట్ చేయడానికి ప్రయత్నించాడు. '' నాకు జెమిమా అంటే చాలా ఇష్టం. చాలా క్యూట్ గా వుంటుంది. నువ్వు ఎవరినైనా చూస్తున్నావా?'' అంటూ ట్వీట్ చేసి దాని రోగ్రిగోస్ కు ట్యాగ్ చేశాడు. 

అయితే ఈ ట్వీట్ పై రోడ్రిగోస్ స్పందించారు. సదరు అభిమానిని నొప్పించకుండానే సున్నితంగా  తిరస్కరించింది. '' ఈ మ్యాచ్ తర్వాత తాను తప్పకుండా నేను ఉమెన్ క్రికెట్ మంచి భవిష్యత్ గురించి కోరుకుంటాను'' అంటూ సమాధానమిచ్చింది. ఆమె సమాధానానికి నెటిజన్లు ఫిదా  అవుతున్నారు. భయపడకుండా ఆకతాయి అభిమానికి బుద్దివచ్చేలా జవాభిచ్చినందుకు జమిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !