స్టేడియంలోనే ఆస్ట్రేలియన్‌కి ప్రపోజ్ చేసిన ఇండియన్ కుర్రాడు... ముద్దులు, హగ్‌లతో...

By team teluguFirst Published Nov 29, 2020, 3:50 PM IST
Highlights

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో రొమాంటిక్ సంఘటన...

మ్యాచ్ జరుగుతుండగా వేల మంది మధ్య తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసిన యువకుడు...

ఆమె అంగీకారంతో స్టేడియంలో రొమాంటిక్ సీన్...

వేల మంది జనాలుండే క్రికెట్ స్టేడియంలో ప్రేమికులు హాజరకావటం, చుట్టూ జనం ఉన్న విషయం కూడా మరిచిపోయి ముద్దుల్లో తేలిపోవడం చాలా మ్యాచుల్లో జరిగేదే. కానీ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో మాత్రం ఓ రొమాంటిక్ సంఘటన జరిగింది.

ఇండియాకు చెందిన ఓ యువకుడు, తన గర్ల్‌ఫ్రెండ్ అయిన ఆస్ట్రేలియన్ యువతికి స్టేడియంలో ప్రపోజ్ చేశాడు. ఈ దృశ్యాలను కెమెరామెన్ కెమెరాలో బంధించాడు. ఇండియన్ యువకుడు ప్రపోజ్ చేసిన విధానానికి షాక్ అయిన ఆ ఆస్ట్రేలియన్ యువతి, అతని ప్రేమను అంగీకరించింది. అతన్ని హగ్ చేసి ప్రేమగా ముద్దాడింది.

ఈ వీడియో స్క్రీన్లలో కనిపించడంతో ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా చప్పట్లతో అభినందనలు తెలిపాడు. ఆతిథ్య ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను పడకొట్టడంలో భారత బౌలర్లు ఇబ్బంది పడుతున్న సమయంలో ఓ ఇండియన్, ఆస్ట్రేలియన్‌ను ఈజీగా పడేసాడంటూ దీనిపై మీమ్స్ కూడా చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

An Indian Proposed an Australian Girl and She said yes 🤣😍 pic.twitter.com/fL6p4voUgr

— Pranjal (@Pranjal_one8)

 

click me!