INDvsAUS 2nd ODI: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... టీమిండియాకి చావోరేవో...

By team teluguFirst Published Nov 29, 2020, 8:48 AM IST
Highlights

ఒత్తిడిలో టీమిండియా... విజయోత్సాహంతో ఆస్ట్రేలియా...

సిరీస్‌‌పై ఆశలు నిలవాలంటే మ్యాచ్ గెలవాల్సిందే...

సిడ్నీలో మరోసారి భారీ స్కోరు ఖాయమేనా... భారత బౌలర్లపైనే భారం!

INDvsAUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయడంతో అదే సిడ్నీ స్టేడియంలో జరుగుతున్న నేటి మ్యాచ్‌లో కూడా భారీ స్కోరు నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

మొదటి వన్డేలో ఓడిన టీమిండియా, ఒత్తిడిలో పడింది. మూడు వన్డేల సిరీస్‌ కోల్పోకుండా ఉండాలంటే నేటి మ్యాచ్‌లో భారత జట్టు గెలిచి తీరాల్సిందే. మరోవైపు మొదటి వన్డేలో అద్భుత విజయం సాధించిన ఆస్ట్రేలియా, నేటి మ్యాచ్ కూడా సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది.

మొదటి వన్డేలో గాయపడిన ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ స్థానంలో మోయిసిస్ హెండ్రిక్స్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత జట్టు మాత్రం జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. 

భారత జట్టు ఇది:
కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ, చాహాల్, సైనీ

ఆస్ట్రేలియా జట్టు ఇది:
ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, లబుషేన్, అలెక్స్ క్యారీ, మోయిసిస్ హెండ్రిక్స్, మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హజల్‌వుడ్, ప్యాట్ కమ్మిన్స్ ‌

click me!