డ్రెస్సింగ్ రూమ్‌లో ‘మాస్టర్’ స్టెప్పులేసిన తమిళనాడు జట్టు... ‘వాతీ కమ్మింగ్’ అంటూ దినేశ్ కార్తీక్...

Published : Feb 01, 2021, 09:13 AM IST
డ్రెస్సింగ్ రూమ్‌లో ‘మాస్టర్’ స్టెప్పులేసిన తమిళనాడు జట్టు... ‘వాతీ కమ్మింగ్’ అంటూ దినేశ్ కార్తీక్...

సారాంశం

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 2021 టైటిల్ గెలిచిన తమిళనాడు... దినేశ్ కార్తీక్ నాయకత్వంలో 14 ఏళ్ల తర్వాత రెండోసారి టైటిల్... డ్రెస్సింగ్ రూమ్‌లో ‘మాస్టర్’ స్టెప్పులతో సెలబ్రేషన్స్... వీడియో వైరల్...  

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ గెలిచిన తమిళనాడు, డ్రెస్సింగ్ రూమ్‌లో స్టెప్పులు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంది. దినేశ్ కార్తీక్ నాయకత్వంలో 14 ఏళ్ల తర్వాత రెండోసారి సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టైటిల్ గెలిచింది తమిళనాడు.

బరోడాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సునాయాస విజయం తర్వాత దినేశ్ కార్తీక్ అండ్ టీమ్ కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో ‘మాస్టర్’ మూవీలోని ‘వాతీ కమ్మింగ్’ పాటకు స్టెప్పులు వేశారు...కెప్టెన్ దినేశ్ కార్తీక్ మధ్యలో నిల్చొని, హీరో విజయ్‌లా స్టెప్పులు వేస్తుంటే... మిగిలిన జట్టు సభ్యులు అతడిని అనుకరించారు.

 

రవిచంద్రన్ అశ్విన్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, విజయ్ శంకర్ వంటి స్టార్ ప్లేయర్లు లేకుండా  టైటిల్ గెలిచి చరిత్ర క్రియేట్ చేశాడు దినేశ్ కార్తీక్. 

PREV
click me!

Recommended Stories

Virat Kohli : సచిన్, పాంటింగ్ లకు షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. సూపర్ రికార్డు !
Shreyas Iyer : 10 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు.. అయ్యర్ వస్తే అదిరిపోవాల్సేందే మరి !