క్వారంటైన్‌లోకి విరాట్ కోహ్లీ... పంజాబ్ పాటలు వింటూ ఫిట్‌నెస్‌పైనే ఫుల్లుగా ఫోకస్...

Published : Jan 30, 2021, 09:19 AM IST
క్వారంటైన్‌లోకి విరాట్ కోహ్లీ... పంజాబ్ పాటలు వింటూ ఫిట్‌నెస్‌పైనే ఫుల్లుగా ఫోకస్...

సారాంశం

నెల రోజుల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న విరాట్ కోహ్లీ... క్వారంటైన్‌లో పూర్తిగా ఫిట్‌నెస్‌పైనే ఫోకస్... 15 రోజులకే భార్యాపిల్లలకు దూరంగా విరాట్ కోహ్లీ...

పెటర్నిటీ లీవ్ ద్వారా ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి వచ్చేసిన భారత సారథి విరాట్ కోహ్లీ... తిరిగి క్రికెట్ మోడ్‌లోకి వచ్చేశాడు. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కోసం చెన్నైలోని హోటెల్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్నాడు విరాట్ కోహ్లీ...

హోటెల్‌లో క్వారంటైన్‌లో ఎక్సర్‌సైజులు చేస్తున్న వీడియోను పోస్టు చేశాడు విరాట్. పంజాబీ పాటలు వింటూ ఫుల్లుగా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడు విరాట్. ‘ఫోబిక్ మ్యూజిక్, జిమ్ ఎక్విప్‌మెంట్... క్వారంటైన్ రోజుల్లో మీకు అవసరమైనవి ఇవే. కావాలంటే ఎక్కడైనా మీరు పని చేసుకోవచ్చు... అందరికీ రోజు బాగుండాలని కోరుకుంటున్నా’ అంటూ కాప్షన్ పెట్టాడు కోహ్లీ..

 

మొదటి రెండు టెస్టులకు ఎంపికైన రహానే, రోహిత్, సిరాజ్, పంత్ అండ్ కో అందరూ చెన్నై చేరుకుని, క్వారంటైన్‌లో గడుతుపున్న విషయం తెలిసిందే. జనవరి 11న విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !