భారత,అస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్ సందర్భంగా సూర్యకిరణ్ టీమ్ ఎయిర్ షో నిర్వహించనుంది.
న్యూఢిల్లీ: భారత్, అస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 19వ తేదీన ఐసీసీ పురుషుల వన్ డే క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో సందర్భంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నాలుగు భాగాలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పోటా పోటీగా జరిగే ఫైనల్ మ్యాచ్ కు వేదికను సిద్దం చేస్తున్నారు.
ఈ నెల 19న మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఆకాశంలో ప్రదర్శనలను ప్రారంభించనున్నారు. భారత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రదర్శన నిర్వహిస్తుంది. పది నిమిషాల పాటు ఈ ఎయిర్ షో ఉంటుంది. సూర్యకిరణ్ అక్రోబాటిక్ టీమ్ 10 నిమిషాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.ఆసియాలోనే తొమ్మిది హాక్ అక్రోబాటిక్ టీమ్ ప్రదర్శనలు నిర్వహించనుంది. ఎయిర్ షోకు ఫ్లైట్ కమాండర్, డిప్యూటీ టీమ్ లీడర్ వింగ్ కమాండర్ సిద్దేష్ కార్తీ నాయకత్వం వహించనున్నారు.ఈ తరహా ఎయిర్ షో గతంలో ఎన్నాడూ జరగలేదు. నరేంద్ర మోడీ స్టేడియం పై నుండి భారత వైమానిక దళానికి చెందిన 9 హక్ పైటర్ జైట్ విమనాల ప్రదర్శనలు సాగుతాయి.
ఈ కార్యక్రమం తర్వాత ఇప్పటివరకు ప్రపంచ కప్ లు సాధించిన ఆయా జట్ల కెప్టెన్లను సన్మానించనున్నారు. 1975 నుండి వరల్డ్ కప్ సాధించిన జట్ల కెప్టెన్లను బీసీసీఐ సన్మానించనుంది.
also read:Icc mens cricket world cup 2023: భారత్, అస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కు అంపైర్లు వీరే...
ఇండియా నెంబర్ వన్ సంగీత దర్శకుడు ప్రీతమ్ నేతృత్వంలోని టీమ్ ప్రదర్శనలు ఇవ్వనుంది.అంతేకాదు ప్రత్యేకమైన లేజర్ షో ను కూడ ఏర్పాటు చేయనున్నారు.ఇందుకోసం స్టేడియం రూఫ్ ను వినియోగించుకోనున్నారు.