Rohit sharma :పాఠ్యాంశంగా రోహిత్ శర్మ చరిత్ర, ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన చిత్రం

By narsimha lode  |  First Published Nov 17, 2023, 5:14 PM IST


ప్రపంచకప్ క్రికెట్ వరల్డ్ కప్ లో అద్భుత విజయాలు సాధిస్తున్న  భారత క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.  రోహిత్ శర్మ సారధ్యం కారణంగానే  భారత జట్టు అద్భుత విజయాలు సాధిస్తుందని అభిప్రాయపడే వారు కూడ లేకపోలేదు.


న్యూఢిల్లీ: ఈ నెల  19వ తేదీన  అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో  ఐసీసీ పురుషుల ప్రపంచకప్  ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ లో  అస్ట్రేలియా, భారత క్రికెట్ జట్లు పోటీ పడనున్నాయి.  ఇండియా ,అస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ కు  ముందు  జనరల్ నాలెడ్డ్ స్కూల్ పుస్తకం ఇంటర్నెట్ లో  వైరల్ గా మారింది.  ఈ పుస్తకంలో ఓ అధ్యాయం పూర్తిగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు అంకితం చేశారు.

రెండు రోజుల క్రితం  న్యూజిలాండ్ తో జరిగిన  సెమీ ఫైనల్ లో  రోహిత్ శర్మ  29 బంతుల్లోనే 47 పరుగులు చేశారు. దీంతో ఈ మ్యాచ్ లో భారత్  నాలుగు వికెట్లు కోల్పోయి  397  పరుగుల భారీ స్కోరును సాధించింది. ఈ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు ఫేసర్ మహమ్మద్ షమీ  అత్యుత్తమ బౌలింగ్ ప్రతిభ కనబర్చారు.   57 పరుగులిచ్చి  ఏడు వికెట్లు పడగొట్టాడు మహమ్మద్ షమీ. దీంతో  న్యూజిలాండ్ పరుగుల తేడాతో  న్యూజిలాండ్ ను ఓడించి భారత జట్టు ఫైనల్ కు చేరింది.

Latest Videos

ప్రపంచ కప్ లలో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో  రోహిత్ శర్మ 550 పరుగులు చేశారు. రెండు వేర్వేరు  ప్రపంచ కప్ పోటీల్లో  500 పరుగులు చేసిన రెండవ భారతీయ బ్యాటర్  రోహిత్ శర్మ.  రోహిత్ శర్మ 120 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో  500 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్ రోహిత్ శర్మే మొదటివాడు.  ప్రపంచకప్ పోటీల్లో  భారత క్రికెట్ జట్టు విజయాల్లో  రోహిత్ శర్మ కీలకపాత్ర పోషించారు.

గురువారంనాడు నాడు ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను  మూడు వికెట్ల తేడాతో  అస్ట్రేలియా ఓడించి ఫైనల్ కు చేరుకుంది.  దీంతో  ఆదివారంనాడు భారత్ తో  అస్ట్రేలియా క్రికెట్ జట్టు టైటిల్ పోరుకు సిద్దమైంది.

అస్ట్రేలియా క్రికెట్ జట్టు  ఐదుసార్లు  ప్రపంచ కప్  ను కైవసం చేసుకుంది. 2003 జరిగిన ప్రపంచకప్ ఫైనల్ పోటీల్లో  భారత్, అస్ట్రేలియా తలపడిన విషయం తెలిసిందే.స్టివెన్ స్మిత్ (30), జోష్ ఇంగ్లిస్(28), మిచెల్ స్టార్క్ (16 నాటౌట్), కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (14 నాటౌట్)  గా నిలిచి అస్ట్రేలియా విజయంలో కీలకపాత్ర పోషించారు. 

 

A chapter on Rohit Sharma in a school book. pic.twitter.com/X3KDtniNKl

— Mufaddal Vohra (@mufaddal_vohra)

మరో వైపు దక్షిణాఫ్రికా జట్టులో ట్రావిస్ హెడ్ అత్యధికంగా 62 పరుగులు సాధించాడు. కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ మూడేసి చొప్పున వికెట్లు తీశారు.  ఆదిలోనే  త్వరత్వరగా  వికెట్లు పోవడంతో  దక్షిణాఫ్రికా ఆటగాళ్లు  ఆత్మరక్షణతో ఆడాల్సి వచ్చింది.ఈ క్రమంలోనే  అస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాను  212 పరుగుల వరకే నియంత్రించగలిగింది.అస్ట్రేలియా ఫీల్డర్లు కూడ  బౌలర్లకు మంచి సహకారం అందించారు.

click me!