వరుస విజయాలతో ఊపు మీదున్న భారత క్రికెట్ జట్టు ఎల్లుండి అస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ లో పోటీ పడనుంది.ఈ మ్యాచ్ కు సంబంధించి అంపైర్లను ఐసీసీ ఎంపిక చేసింది.
న్యూఢిల్లీ:ఇంగ్లాండ్ కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, రిచర్డ్ కెటిల్ బర్ లు ఇండియా, అస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ కు ఫీల్డ్ అంపైర్లుగా ఎంపికయ్యారు. అంతేకాదు థర్డ్ అంపైర్ గా జోయల్ విల్సన్, నాలుగో అంపైర్ గా క్రిస్ గఫానీ, మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ ను నియమించారు.
ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్ లో ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో ఇంగ్లాండ్ కు చెందిన ఇద్దరిని ఫీల్డ్ ఎంపైర్లుగా ఐసీసీ ఎంపిక చేసింది. కెటిల్ బరో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కు ఫీల్డ్ అంపైర్ గా బాధ్యతలు నిర్వహించడం ఇది రెండోసారి. 2015లో ఫైనల్ మ్యాచ్ లో కుమార్ ధర్మసేనతో కలిసి ఆయన ఫీల్డ్ అంఫైర్ గా వ్యవహరించాడు. అస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ ను సుమారు 93 వేల మంది ప్రేక్షకులు వీక్షించారు. ఆదివారంనాడు అహ్మదాబాద్ లో జరిగే భారత్, అస్ట్రేలియా జట్ల మధ్య జరిగే వరల్డ్ కప్ ఫైన్ మ్యాచ్ ను తిలకించేందుకు లక్షల మంది అభిమానులు వచ్చే అవకాశం ఉంది.
also read:Rohit sharma :పాఠ్యాంశంగా రోహిత్ శర్మ చరిత్ర, ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన చిత్రం
2009 నవంబర్ లో ఐసీసీ అంతర్జాతీయ జాబితాకు ఇల్లింగ్ వర్త్, కెటిల్ బరో పదోన్నతి పొందారు. ఈ వారం జరిగిన సెమీ ఫైనల్స్ లో ఈ ఇద్దరూ ఆన్ ఫీల్డ్ అంపైర్లు గా వ్యవహరించారు. న్యూజిలాండ్, భారత జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు ఇల్లింగ్ వర్త్ ఆన్ ఫీల్డ్ అంఫైర్ గా వ్యవహరించాడు.
దక్షిణాఫ్రికా, అస్ట్రేలియా మ్యాచ్ కు కెటిల్ బరో ఆన్ ఫీల్డ్ ఎంపైర్ గా వ్యవహరించారు.