మెయిన్ టీమ్ ఫెయిల్... A టీమ్ సూపర్ హిట్! బంగ్లాపై భారత్-A టీమ్ టాప్ క్లాస్ పర్ఫామెన్స్..

By Chinthakindhi RamuFirst Published Dec 9, 2022, 1:01 PM IST
Highlights

బంగ్లాదేశ్‌- ఏ జట్టుతో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 123 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న భారత-A జట్టు.. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్... 

బంగ్లాదేశ్ పర్యటనలో భారత ప్రధాన జట్టు తొలి రెండు మ్యాచుల్లో పరాజయాలను చవిచూసింది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమై, ఆఖరి వికెట్ తీయలేక ఓడిపోయిన రోహిత్ సేన, రెండో వన్డేలో 272 పరుగుల లక్ష్యఛేదనలో 5 పరుగుల దూరంలో ఆగిపోయింది. అయితే భారత ప్రధాన జట్టు ఫెయిల్ అవుతున్న చోట, భారత ఏ జట్టు టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తోంది...

బంగ్లాదేశ్-A టీమ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 112 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సౌరబ్ కుమార్ 4 వికెట్లు తీయగా నవ్‌దీప్ సైనీ 3 వికెట్లు తీశాడు. ముకేశ్ కుమార్ చౌదరికి 2 వికెట్లు దక్కాయి... భారత్ -A జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 132 ఓవర్లు ఆడి 5 వికెట్ల నష్టానికి 465 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది...

యశస్వి జైస్వాల్ 145, అభిమన్యు ఈశ్వరన్ (ఇండియా -A టీమ్ కెప్టెన్) 142 పరుగులు చేయగా యష్ దుల్ 20, తిలక్ వర్మ 33, సర్ఫరాజ్ ఖాన్ 21, ఉపేంద్ర యాదవ్ 71 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో జాకీర్ హసన్ 173 పరుగులు చేసి రాణించడంతో 341/9 పరుగులు చేసింది బంగ్లాదేశ్-A జట్టు.

టీమిండియా-A మరో వికెట్ తీసి ఉంటే విజయాన్ని అందుకుని ఉండేది. తాజాగా రెండో అనధికార టెస్టులోనూ భారత -A జట్టు టాప్ క్లాస్ పర్పామెన్స్‌తో ఇరగదీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత -A జట్టు 147.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 562 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది...

యశస్వి జైస్వాల్ 12 పరుగులు చేసి అవుట్ కాగా ఛతేశ్వర్ పూజారా 52, యష్ దుల్ 17 పరుగులు చేశారు. సర్ఫరాజ్ ఖాన్ డకౌట్ అయినా అభిమన్యు ఈశ్వరన్ 157 పరుగులు చేసి రెండో సెంచరీ నమోదు చేశాడు. శ్రీకర్ భరత్ 77 పరుగులు చేయగా జయంత్ యాదవ్ 83 పరుగులు చేశాడు...

సౌరబ్ కుమార్ 55, ఉమేశ్ యాదవ్ 18, నవ్‌దీప్ సైనీ 50, ముకేశ్ కుమార్ చౌదరి 23 పరుగులు చేశారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ల దాదాపు 300 పరుగులు రాబట్టింది భారత ఏ జట్టు...

భారత ప్రధాన జట్టుకి ఆడుతున్న ప్లేయర్లు, టాపార్డర్, మిడిల్ ఆర్డర్‌లోనే పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతుంటే, అదే బంగ్లా పర్యటనలో బంగ్లా టీమ్‌పై టీమిండియా -A జట్టు ఇచ్చిన పర్ఫామెన్స్ హాట్ టాపిక్ అవుతోంది.. 

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఏ జట్టు 80.5 ఓవర్లలో 252 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ముకేశ్ కుమార్ చౌదరి 6 వికెట్లు తీయగా జయంత్ యాదవ్ 2, ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీశారు.

రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 79.5 ఓవర్లలో 187 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సౌరబ్ కుమార్ 6 వికెట్లు తీయగా ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ రెండేసి వికెట్లు తీశారు. దీంతో టీమిండియా-A జట్టు ఇన్నింగ్స్ 123 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకుంది.. 

click me!