Anushka Sharma: బంతి, బ్యాట్ తో అదరగొట్టిన అనుష్క శర్మ.. 2 రనౌట్లు కూడా.. విరాట్ కోహ్లికి పొటీ ఇవ్వనుందా..?

By team teluguFirst Published Nov 2, 2021, 6:14 PM IST
Highlights

Women's U-19 Challenger Trophy 2021-22: విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్  నటి అయిన అనుష్క శర్మ క్రికెట్ ఆడటం ఎప్పట్నుంచి ప్రారంభించింది..? అనేగా మీ ప్రశ్న.  అయితే ఇది చదవండి. 

అనుష్క శర్మ (Anushka Sharma) ఇరగదీసింది. తొలుత బ్యాటింగ్ లో 72 పరుగులు చేసిన ఆమె.. తర్వాత బంతితోనూ విజృంభించింది. ఐదు వికెట్లను తీసి ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచింది. అంతే కాదండోయ్.. ఫీల్డింగ్ లో పాదరసంగా కదులుతూ ఇద్దరు బ్యాటర్లను రనౌట్ చేసి తన జట్టును గెలిపించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన  అనుష్క శర్మ ఆటకు ఇప్పుడు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. భవిష్యత్తులో  భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) రికార్డులకు చెక్ పెట్టనుందని కామెంట్లు చేస్తున్నారు. 

అదేంటి.. విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ (Bollywood) నటి అయిన అనుష్క శర్మ క్రికెట్ ఆడటం ఎప్పట్నుంచి ప్రారంభించింది..? అనేగా మీ ప్రశ్న. ఆగండాగండి. ఈ అనుష్క శర్మ.. విరాట్ సతీమణి కాదు. భారత మహిళా క్రికెటర్. ఇండియా అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు సారథి కూడా. ఈ ఆల్ రౌండర్..  జైపూర్ లో జరుగుతున్న ఇండియా ఉమెన్స్ అండర్-19 వన్ డే ఛాలెంజర్ ట్రోఫీ (women's U-19 Challenger Trophy) లో అదరగొట్టింది.

అనుష్క శర్మ.. ఇండియా-బి కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నది. జైపూర్ (రాజస్థాన్) లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా-బి.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది.  అనుష్క శర్మ (72), జి. త్రిష (112) రాణించారు. వీరిరువురు కలిసి 188 పరుగులు ఓపెనింగ్ బాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. 

 

Anushka Sharma 52 runs in 88 balls (5x4, 1x6) India B 140/0

— BCCI Women (@BCCIWomen)

కాగా.. 225  పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ఇండియా-ఎ.. 129 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా అనుష్క శర్మ సారథ్యంలోని ఇండియా-బి.. 92 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ లో అదరగొట్టిన అనుష్క శర్మ.. తర్వాత బంతితోనూ అద్భుతాలు చేసింది. ఏకంగా ఆమె ఐదు వికెట్లు పడగొట్టింది. ఇండియా-ఎ కోల్పోయిన వికెట్లన్నీ అనుష్క శర్మకు దక్కినవే కావడం విశేషం.  ఆమెకు ఐదుు వికెట్లు దక్కగా.. మిగిలిన ఐదుగురు రనౌట్ గా వెనుదిరిగారు. ఈ రనౌట్లలో కూడా అనుష్క భాగస్వామ్యం ఉంది. రెండు రనౌట్లు ఆమె చేసినవే. 

 

pic.twitter.com/rBbs0uXdTP

— batman (@batman4city)

ఇదిలాఉండగా.. అనుష్క శర్మకు సంబంధించిన ఫీట్ పై బీసీసీఐ ఉమెన్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ విషయాన్ని ప్రకటించగానే నెటిజన్లు పలు ఆసక్తికర కామెంట్స్  పెట్టారు. 

 

Tumlog btaye kyu nhi Ki Anushka match khelne gyi hai , vamika ro rhi hai pic.twitter.com/s0yZVy7bej

— Sumit □◇○ (@UN_PrEdiTAble)

‘అదేంటి.. కోహ్లి భార్య  క్రికెట్ ఆడటం ఎప్పట్నుంచి మొదలుపెట్టింది..? ’ అని పలువురు స్పందించగా.. విరాట్, అనుష్కల సంబంధించిన మీమ్స్  చేస్తూ దీనిని వైరల్  చేశారు అన్నట్టు.. ఈ మ్యాచ్ లో ఇరగదీసిన అనుష్క శర్మ మధ్యప్రదేశ్ కు చెందిన ఆల్ రౌండర్. 

click me!