ఒక్క సెంచరీ.. ఎన్నో రికార్డులు: గంగూలీని వెనక్కినెట్టి, సచిన్‌కి గురిపెట్టిన కోహ్లీ

Siva Kodati |  
Published : Aug 12, 2019, 11:50 AM IST
ఒక్క సెంచరీ.. ఎన్నో రికార్డులు: గంగూలీని వెనక్కినెట్టి, సచిన్‌కి గురిపెట్టిన కోహ్లీ

సారాంశం

టీమిండియా పరుగుల యంత్రం, రికార్డుల రారాజు ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేసి పలు రికార్డులను బద్ధలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచాడు. 

దాదా 311 మ్యాచ్‌లలో 11,363 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ కేవలం 238 వన్డేల్లో 11,406 పరుగులు చేయడం విశేషం. ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

మరోవైపు ఇదే మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన పాక్ దిగ్గజం జావెద్ మియాందాద్‌ పేరిట 26 ఏళ్లుగా ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. మియాందాద్ 64 ఇన్నింగ్స్‌ల్లో 1930 పరుగులు చేస్తే.. కోహ్లీ కేవలం 35 ఇన్నింగ్స్‌ల్లోనే 2032 పరుగులు చేయడం విశేషం.

2009 ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా జోహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌ ద్వారా కోహ్లీ తొలిసారిగా వెస్టిండీస్‌తో వన్డే ఆడాడు. 2011లో విశాఖలో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై తొలి సెంచరీ సాధించాడు. 

PREV
click me!

Recommended Stories

Aman Rao: షమీ, ఆకాష్ దీప్‌లను ఉతికారేసిన తెలుగు కుర్రాడు.. 12 ఫోర్లు, 13 సిక్సర్లతో డబుల్ సెంచరీ
SRH స్టార్ విధ్వంసం.. అరుదైన రికార్డు ట్రావిస్ హెడ్ సొంతం !