సింగిల్ హ్యాండ్‌తో భువి అద్భుత క్యాచ్.. మ్యాచ్ మలుపు తిరిగిందిక్కడే

By Siva KodatiFirst Published Aug 12, 2019, 10:51 AM IST
Highlights

నిలబడలేకపోయారు. 35వ ఓవర్‌లో విండీస్ బ్యాట్స్‌మెన్ ఛేజ్ కొట్టిన బంతిని భువి అద్భుతంగా అందుకున్నాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌లో పడిన బంతిని ఛేజ్.. బౌలర్ పక్క నుంచి ఆడాడు.. తన వైపుగా వస్తున్న బంతిని గుర్తించిన భువనేశ్వర్ కుమార్ రెప్పపాటులో ఎడమ వైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. 

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ భువనేశ్వర్ కుమార్ భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.

ముఖ్యంగా భువి ధాటికి విండీస్ బ్యాట్స్‌మెన్లు నిలబడలేకపోయారు. 35వ ఓవర్‌లో విండీస్ బ్యాట్స్‌మెన్ ఛేజ్ కొట్టిన బంతిని భువి అద్భుతంగా అందుకున్నాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌లో పడిన బంతిని ఛేజ్.. బౌలర్ పక్క నుంచి ఆడాడు.. తన వైపుగా వస్తున్న బంతిని గుర్తించిన భువనేశ్వర్ కుమార్ రెప్పపాటులో ఎడమ వైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు.

దీంతో పూరన్-ఛేజ్‌ల జోడీకి బ్రేక్ పడింది. ఆ వెంటనే పూరన్‌ కూడా భువి ఔట్ చేసి.. ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరిని పెవిలియన్‌కు పంపి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 8 ఓవర్లు వేసిన భువనేశ్వర్ కుమార్ 31 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. 

click me!