విండీస్ తరపున అతనొక్కడే: లారా రికార్డులను బద్ధలుకొట్టిన క్రిస్‌గేల్

Siva Kodati |  
Published : Aug 12, 2019, 12:33 PM IST
విండీస్ తరపున అతనొక్కడే: లారా రికార్డులను బద్ధలుకొట్టిన క్రిస్‌గేల్

సారాంశం

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌-భారత్‌ల మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన రెండో వన్డే అనేక రికార్డులకు వేదికైంది. విండీస్ తరపున అత్యధిక వన్డేలు ఆడటంతో పాటు అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా క్రిస్‌గేల్ రికార్డుల్లోకి ఎక్కాడు

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌-భారత్‌ల మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన రెండో వన్డే అనేక రికార్డులకు వేదికైంది. విండీస్ తరపున అత్యధిక వన్డేలు ఆడటంతో పాటు అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా క్రిస్‌గేల్ రికార్డుల్లోకి ఎక్కాడు.

ఇప్పటి వరకు ఈ రెండు రికార్డులు బ్రియాన్ లారా పేరిట ఉన్నాయి. లారా 299లు వన్డేలు ఆడి.. 10,405 పరుగులు చేశాడు. ఈ వన్డే ద్వారా గేల్ 300 వన్డేలు ఆడాడు. మ్యాచ్‌కు ముందు లారా రికార్డుకు 9 పరుగుల దూరంలో నిలిచిన గేల్ .. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టడం ద్వారా లారా రికార్డును బద్ధలు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో విజయ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270 పరుగులకు కుదించారు. అయితే భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ 210 పరుగులకే అలౌటయ్యింది. 

PREV
click me!

Recommended Stories

Famous Batsmens : పసికూనలపైనే వీరి ప్రతాపం.. అభిమానులను బోల్తా కొట్టించిన టాప్ 5 క్రికెటర్లు
T20 World Cup : వన్ మ్యాన్ ఆర్మీ కోహ్లీ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ దాకా.. ఈ లిస్ట్ చూస్తే గూస్‌బంప్స్ పక్కా !