రవీంద్ర జడేజా ఔట్ ఎఫెక్ట్: అంపైర్ పై విరాట్ కోహ్లీ ఆగ్రహం

By telugu teamFirst Published Dec 15, 2019, 9:09 PM IST
Highlights

చెన్నైలోని చేపాక్ స్టేడియంలో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి వన్డేలో రవీంద్ర జడేజాను అవుట్ ఇచ్చిన తీరుపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంపైర్ పై మండిపడ్డాడు. వివాదాస్పదమైన అవుట్ పై అతను అసంతృప్తి వ్యక్తం చేశాడు.

చెన్నై: చెన్నైలోని చేపాక్ స్టేడియంలో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచులో రవీంద్ర జడేజా అవుట్ ఇవ్వడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 48వ ఓవరులో రవీంద్ర జడేజా సింగిల్ తీస్తుండగా రోస్తోన్ చేజ్ స్టంప్స్ ను కొట్టాడు. 

,స్క్రీన్ పై రిప్లేను చూసిన తర్వాత చేజ్ అపీల్ చేశాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ రన్నవుట్ ను చెక్ చేయడానికి అప్ స్టెయిర్స్ కు వెళ్లాడు. ఇంతలో థర్డ్ అంపైర్ రన్నవుట్ ఇచ్చేశాడు. ఈ వివాదాస్పదమైన అవుట్ పై కోహ్లీ మండిపడ్డాడు. 

Also Read: రిషబ్ పంత్ మారడు: అదే షాట్, అదే ఔట్

టాస్ గెలిచి బ్యాటింగ్ బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ టీమిండియాను 288 పరుగులకు కట్టడి చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ వికెట్లను కాపాడుకుంటూ లక్ష్యాన్ని ఛేదించే పనిలో పడింది.

వెస్టిండీస్ బ్యాట్స్ మన్ హెట్ మెయిర్ సెంటరీ చేసి అవుటయ్యాడు. హోప్ తో కలిసి పరుగుల వరద పారించాడు. చివరకు అతను మొహ్మద్ షమీ బౌలింగులో శ్రేయాస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి 139 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. హెట్ మెయిర్ అవుట్ తో భారత్ ఊపిరి పీల్చుకుంది.

Also Read: మైదానంలోకి వీధి కుక్క: ఆగిన ఆట, బిత్తరపోయిన పంత్, శ్రేయాస్

click me!