రిషబ్ పంత్ మారడు: అదే షాట్, అదే ఔట్

By telugu teamFirst Published Dec 15, 2019, 8:26 PM IST
Highlights

వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ రిషబ్ పంథ తన పంథా మార్చుకునేట్లు లేడు. గతంలో చేసిన తప్పునే వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచులో చేసి అవుటయ్యాడు. అయితే, ఎట్టకేలకు అతను ఓ అర్థ సెంచరీ చేయగలిగాడు.

చెన్నై: ఎట్టకేలకు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫామ్ లోకి వచ్చాడు. వెస్టిండీస్ పై ఆదివారం జరుగుతున్న మ్యాచులో అతను కాస్తా బాగానే ఆడాడు. 69 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ తో 71 పరుగులు చేసి అవుటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ తో కలిసి ఇన్నింగ్సును నిర్మించాడు. 

బాగా ఆడుతున్న సమయంలో చిన్న పొరపాటు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. తనకు సాధ్యం కాని ఓ షాట్ ను కొట్టి అతను వికెట్ ను జారవిడుచుకున్నాడు. డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్, డీప్ పాయింట్ ల్లో అతను అవుటవుతూ వస్తున్నాడు. అదే తప్పు ఈ మ్యాచులోనూ పంత్ చేశాడు. 

Also Read: మైదానంలోకి వీధి కుక్క: ఆగిన ఆట, బిత్తరపోయిన పంత్, శ్రేయాస్

బ్యాక్ వర్డ్ స్క్వైర్ లెగి లోకి భారీ షాట్ కొట్టి రిషబ్ పంత్ అవుటయ్యాడు. పోలార్డ్ వేసిన 40 ఓవరులోని మూడో బంతిని కవర్స్ మీదుగా ఫోర్ కు తరలించిన పంత్ ఆ ఓవరు తర్వాతి బంతిని స్క్వేర్ లేగ్ మీదు భారీ షాట్ కు ప్రయత్నించాడు.

అయితే, బంతి బ్యాట్ మీదికి సరిగా రాకపోవడంతో పైకి లేచింది. దాంతో హెట్ మియర్ కు క్యాచ్ గా వెళ్లింది. దాంతో పంత్ తన ఇన్నింగ్సును ముగించాడు. అంతర్జాతీయ వన్డేల్లో పంత్ ఆడుతూ వస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు అతను ఒక్క అర్థ సెంచరీని కూడా నమోదు చేసుకోలేదు. ఈ మ్యాచ్ లో ఆ లోటును భర్తీ చేసుకున్నాడు. 

Also Read: టీమిండియా: రిషబ్ పంత్ కు కేఎల్ రాహుల్ ముప్పు

click me!