India vs South Africa 3rd ODI: భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే పార్ల్ లోని బోలాండ్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంటుంది.
Ind vs Sa: దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా భారత్ జట్టు నేడు నిర్ణయాత్మకమైన మూడో వన్డేను ఆడుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అనుకున్నట్టుగానే రజత్ పాటిదార్ ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను నిలబెట్టుకోవాలని భారత్ జట్టు చూస్తుండగా, స్వదేశంలో సిరీస్ ను కోల్పోకూడదని దక్షిణాఫ్రికా నిర్ణయించుకుంది. గురువారం పార్ల్ లోని బోలాండ్ పార్క్ స్టేడియంలో జరిగే మూడో వన్డే మ్యాచ్ లో కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్యంలోని మెన్ ఇన్ బ్లూ జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ ఇచ్చాడు.
పిచ్ రిపోర్ట్:
ప్రస్తుతం వాతావరణం వేడిగా ఉంది. 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. దీంతో పిచ్ పొడిగా ఉంటుంది, కొంచెం గడ్డి కప్పబడి ఉండటంతో పిచ్ నెమ్మదిగా ఉంటుంది. మొదట బౌలింగ్ చేసిన వారికి అనుకూలించనుంది. పార్ల్ లో తొలి ఇన్నింగ్స్ లో సగటు స్కోరు 272 గా ఉండగా, అంతకంటే ఎక్కువగానే భారీ స్కోర్లు కూడా నమోదయ్యే అవకాశముంది.
ఇరు జట్లలోని ప్లేయర్స్:
భారత్ (ప్లేయింగ్ XI):
సంజు శాంసన్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(w/c), రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):
రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్(w), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్
IND Vs SA: కీలకపోరు.. భారత్, దక్షిణాఫ్రికా మూడో వన్డే.. టీంలోకి కొత్త ప్లేయర్