IND vs SA: తొలి రోజే 23 వికెట్లు.. ఉత్కంఠభరితంగా మారిన  రెండో టెస్టు.. 

By Rajesh Karampoori  |  First Published Jan 3, 2024, 11:16 PM IST

IND vs SA: దక్షిణాఫ్రికా, భారత్‌ (SA vs IND)ల మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. కేప్ టౌన్ పిచ్ పేస్ బౌలింగ్ కు అనుకూలించడంతో తొలిరోజు ఇరు జట్లు ఒడిదుడుకులెదురుకున్నాయి. దీని ఫలితంగా మొత్తం 23 వికెట్లు నేలకూలాయి. 


IND vs SA: కేప్ టౌన్ వేదికగా జరుగుతోన్న దక్షిణాఫ్రికా, భారత్‌ (SAvsIND) రెండో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ పిచ్ పేస్ బౌలింగ్ కు కలిసిరావడంతో తొలిరోజు ఇరు జట్లు ఒడిదుడుకులు ఎదురుకున్నాయి. దీని ఫలితంగా మొత్తం 23 వికెట్లు నేలకూలాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా విఫలమైంది. కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బంతితో అదరగొట్టి.. రోహిత్ సేనను కేవలం 153 పరుగులకే కట్టడి చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 98 పరుగుల ఆధిక్యంతో నిలిచింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను  ప్రారంభించిన సఫారీ జట్టు మొదటి 10 ఓవర్లు నిలకడగానే ఆడి 37/0 స్కోరు చేసింది. కానీ, భారత బౌలర్లు విజృంభించడంతో వరుసగా 3 వికెట్లు కోల్పోయింది. ముకేశ్ కుమార్ తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. డీన్‌ ఎల్గర్ (12), టోనీ డి జోర్జి (1)లకే వెనుదిరిగారు. కాసేపటికే మరో బ్యాట్స్ మెన్ ట్రిస్టన్‌ స్టబ్స్‌ (1) బుమ్రా బౌలింగ్ లో తడబడ్డాడు. ఫెవిలియన్ కు చేరారు. ఈ క్రమంలో తొలి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా62 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. బెడింగ్‌హమ్‌ (7*), మార్‌క్రమ్ (36*) అజేయంగా నిలిచారు. భారత్‌ ప్రస్తుతం 36 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ తరఫున ముఖేష్ కుమార్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ ను పడగొట్టారు. 

Latest Videos

undefined

తొలిరోజు రికార్డు స్థాయిలో 23 వికెట్లు పతనం 

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ కేవలం 55 పరుగులకే పరిమితమైంది. భారత్ తరఫున మహ్మద్ సిరాజ్ అత్యధికంగా 6 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా జస్ప్రీత్ బుమ్రా,ముఖేష్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా కూడా రాణించలేకపోయింది. సఫారీ ఫేస్ బౌలర్ల దాటికి టీమిండియా 153 పరుగులకు ఆలౌటైంది. అదే సమయంలో టీమిండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టీ విరామ సమయానికి 111/4 స్కోరుతో నిలిచిన టీమిండియా.. చివరి సెషన్‌లో అనుహ్యంగా కుప్పకూలింది.

భారత్ తన చివరి ఆరు వికెట్లను 11 బంతుల వ్యవధిలో 153 పరుగుల వద్దే కోల్పోవడం గమనార్హం. లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పారు. ఎంగిడి వేసిన ఓవర్లో కేఎల్ రాహుల్ (8), రవీంద్ర జడేజా (0), జస్‌ప్రీత్‌ బుమ్రా (0)ల వికెట్లను పడగొట్టారు. అనంతరం రబాడ బౌలింగ్ వేశాడు. ఈ  ఓవర్‌లో విరాట్ కోహ్లీ .. మార్‌క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అదే ఓవర్లో సిరాజ్(0)రనౌట్ అయ్యాడు. చివరిగా ప్రసిద్ధ్‌ కృష్ణ (0)బౌల్డ్ అయ్యాడు. టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్స్ యశస్వి జైస్వాల్ (0), శ్రేయస్ అయ్యర్ (0) ఎలాంటి పరుగులు చేయకుండా వెనుదిరిగారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ, లుంగి ఎన్‌గిడి, నాండ్రే బెర్గర్ తలో 3 వికెట్లు తీశారు. అయితే, అప్పటికి భారత జట్టు 98 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

శివాలెత్తిన సిరాజ్ 

అంతకుముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు భారత బౌలర్ల ముందు నిలువలేకపోయింది. కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. మరీ ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ తన ఫేస్ బౌలింగ్ లో సఫారీ బ్యాట్స్ మెన్స్ కు చుక్కలు చూపించారు.  అత్యధికంగా ఆరు వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్ లు కూడా చేలారేగారు. వారూ చెరో రెండు వికెట్లు తీశారు. కేవలం ఇద్దరు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు.

కైల్ వెర్న్ 15 పరుగులు, డేవిడ్ బెడింగ్‌హామ్ 12 పరుగులు చేశారు. ఇది కాకుండా ఏ బ్యాట్స్‌మెన్ కూడా రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. ఐడెన్ మార్క్రామ్ (2 పరుగులు), డీన్ ఎల్గర్ (4 పరుగులు), టోనీ డి జార్జి (2 పరుగులు), ట్రిస్టన్ స్టబ్స్ (3 పరుగులు), మార్కో జాన్సెన్ (0 పరుగులు), కేశవ్ మహరాజ్ (3 పరుగులు), కగిసో రబడ (5 పరుగులు), నాంద్రే బెర్గర్ 4 పరుగులకే అవుటయ్యాడు. ఇలా భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా తొలి సెషన్‌లో 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది.

1991లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు అత్యల్ప స్కోరు ఇదే. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్‌పై ఓ ప్రత్యర్థి జట్టు చేసిన అత్యల్ప స్కోరు కూడా ఇదే. అలాగే.. ఒక టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు అత్యధిక వికెట్లు (23) తీయడం ఇది రెండోసారి. అంతకుముందు 1902లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలి రోజే 25 వికెట్లు పడగొట్టారు.
 

click me!