దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 153 పరుగులకే ఆలౌటైంది. టీ విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 111 పరుగులతో మంచి స్థితిలోనే టీమిండియా చివరి సెషన్‌లో ఆరు వికెట్లు కోల్పోయింది. 11 బంతుల్లోనే భారత్ తన చివరి ఆరు వికెట్లను కోల్పోయింది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 153 పరుగులకే ఆలౌటైంది. టీ విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 111 పరుగులతో మంచి స్థితిలోనే టీమిండియా చివరి సెషన్‌లో ఆరు వికెట్లు కోల్పోయింది. 11 బంతుల్లోనే భారత్ తన చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. ఎంగిడి, రబాడాలు వరుసగా వికెట్లు పడగొట్టి టీమిండియా వెన్ను విరచడంతో పాటు మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఎంగిడి ఒకే ఓవర్‌లో కేఎల్ రాహుల్ (8), జడేజా (0), జస్‌ప్రీత్ బుమ్రా (0)లను ఔట్ చేశాడు. రబాడా , నిగిడి, బర్గర్‌లు తలో 3 వికెట్లు పడగొట్టారు. భారత బ్యాట్స్‌మెన్‌లలో రోహిత్ శర్మ (39), శుభమన్ గిల్ (36), విరాట్ కోహ్లీ (46) పరుగులు చేశారు. మొత్తం మీద భారత్‌కు 98 పరుగుల ఆధిక్యం లభించింది.
అంతకుముందు ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు అదరగొట్టారు. బౌలర్లకు అనుకూలించే ఈ పిచ్ పై నిప్పులు చెరిగారు. దీంతో సౌతాఫ్రికా జట్టు 55 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్ లు చెరో రెండు వికెట్లు తీశారు. తొలి రోజు లంచ్ సమయానికి సిరాజ్ భారత్ కు మంచి ఫలితాన్ని అందించాడు.
సెంచూరియన్ లో బాక్సింగ్ డేలో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత జట్టు.. రెండో టెస్టును ఎలాగైనా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగానే భారత బౌలర్లు తొలిరోజు బాగా రాణించారు. 9 ఓవర్లు వేసిన మహ్మద్ సిరాజ్ 15 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. ఆతిథ్య జట్టు 55 పరుగులకే ఆలౌటైంది. తన చివరి టెస్టులో టాస్ గెలిచిన ఎల్గర్.. మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత సిరాజ్ మ్యాజిక్ స్పెల్ వేయడంతో సౌతాఫ్రికాకు కష్టాలు మొదలయ్యాయి. స్వింగ్, సీమ్, కచ్చితత్వంతో బౌలింగ్ వేసి సౌతాఫ్రికా పతనాన్ని సిరాజ్ శాసించాడు.
డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రేన్నేలు మినహా సౌతాఫ్రికా ప్లేయర్లు అందరూ సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యారు. తన అద్భుత బౌలింగ్ తో సిరాజ్ 6 వికెట్లు తీసుకున్నాడు. తొలి సెషన్ లో ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసుకున్న సిరాజ్.. రెండో సెషన్ లో మూడు వికెట్లు తీశాడు. ఐడెన్ మార్క్‌రమ్, డీన్ ఎల్గర్, టోనీ డి జోర్జీ, డేవిడ్ బెడింగ్‌హామ్, మార్కో జాన్సెన్, కైల్ వెర్రేన్నేలను సిరాజ్ ఔట్ చేశాడు. అలాగే, భారత సేసర్ జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్ లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఆ వెంటనే తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్‌లు ధాటిగా ఆడారు. అయితే బర్గర్ .. రోహిత్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లను వెంట వెంటనే పెవిలియన్‌కు పంపాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ కాసేపటికీ అతనిని రబాడా ఔట్ చేశాడు. ఆ తర్వాత టీమిండియా కోలుకోలేకపోయింది. ఆరుగురు భారత బ్యాట్స్‌మెన్లు డకౌట్ కావడం గమనార్హం