దక్షిణాఫ్రికా 94/8: విశాఖ టెస్టులో విజయానికి చేరువలో భారత్

Siva Kodati |  
Published : Oct 06, 2019, 11:22 AM ISTUpdated : Oct 06, 2019, 11:33 AM IST
దక్షిణాఫ్రికా 94/8: విశాఖ టెస్టులో విజయానికి చేరువలో భారత్

సారాంశం

ఓవర్‌నైట్ స్కోర్ 11/1తో చివరి రోజు ఆట ప్రారంభించిన సఫారీలు వరుసపెట్టి వికెట్లను చేజార్చుకున్నారు. 70 పరుగులకే  8 వికెట్లు కోల్పోయిన ఆ జట్టుకు ఓటమి దాదాపుగా ఖాయమైంది

విశాఖ టెస్టులో టీమిండియా విజయానికి చేరువవుతోంది. భారత్ నిర్దేశించిన 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా టీమిండియా బౌలర్ల ధాటికి కష్టాల్లో పడిండి.

ఓవర్‌నైట్ స్కోర్ 11/1తో చివరి రోజు ఆట ప్రారంభించిన సఫారీలు వరుసపెట్టి వికెట్లను చేజార్చుకున్నారు. 70 పరుగులకే  8 వికెట్లు కోల్పోయిన ఆ జట్టుకు ఓటమి దాదాపుగా ఖాయమైంది.

ముఖ్యంగా పేసర్ షమీ, స్పిన్నర్ జడేజాలు రెచ్చిపోయారు. 12వ ఓవర్‌లో తెంబ బవుమాను బౌల్డ్ చేసిన షమీ.. ఆ తర్వాత  22వ ఓవర్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లిసెస్‌ను, 24వ ఓవర్‌లో డికాక్‌ను వెంట వెంటనే ఔట్ చేసి సఫారీలను కోలుకోలేని దెబ్బతీశాడు.

ఓపెనర్  మార్కరమ్, ఫిలిండర్, మహరాజ్‌,బ్రయాన్‌ను జడేజా పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 34 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 94 పరుగుల వద్ద నిలిచింది. సఫారీలు గెలవాలంటే  ఇంకా 301 పరుగులు చేయాల్సి ఉంది. ముత్తుసామి 11, డాని 17 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Cricketers Assault : ఎంతకు తెగించార్రా..గ్రౌండ్ లోనే క్రికెట్ కోచ్‌ తల పగలగొట్టిన ప్లేయర్స్ !
IPL Brand Value: ఐపీఎల్ జట్లకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్, ఆర్సీబీ బ్రాండ్ విలువ ఢమాల్ ! కష్టమేనా?