తండ్రైన రహానే:పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన భార్య రాధిక

Published : Oct 05, 2019, 05:33 PM IST
తండ్రైన రహానే:పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన భార్య రాధిక

సారాంశం

టీం ఇండియా టెస్ట్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రహానేకు సౌత్ ఆఫ్రికాతో టెస్టు ఆడుతుండగానే తండ్రయ్యాడనే వార్త తెలిసింది. 

న్యూఢిల్లీ: టీం ఇండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే తండ్రయ్యాడు. టీం ఇండియా టెస్ట్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రహానేకు సౌత్ ఆఫ్రికాతో టెస్టు ఆడుతుండగానే తండ్రయ్యాడనే వార్త తెలిసింది. 

నేడు రహానే సతీమణి రాధికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2014లో ఒక్కటైనా రహానే రాడికల్ జంట చిన్నప్పటినుండి క్లాస్ మేట్స్. స్కూల్ నుంచి సాగుతున్న వీరి పరిచయం ప్రేమగా మరి ఇద్దరిని ఒక్కటి చేసింది. 

రహానే తండ్రయ్యాడన్న వార్తను తొలుత వెల్లడించింది హర్భజన్ సింగ్. ట్విట్టర్ వేదికగా హర్భజన్ సింగ్ ఈ విషయాన్నీ వెల్లడించాడు. "కొత్తగా డాడీ అవతారం ఎత్తబోతున్న రహానేకు అభినందనలు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఫన్ మొదలయింది లైఫ్ లో" అని ట్వీట్ చేసాడు. 

టెస్టు మ్యాచ్ మధ్యలో ఇలా సంతోషకరమైన వార్త తెలియడంతో రహానే ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు. తోటి క్రికెటర్లంతా శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో అభిమానులు ఇతర ఆటగాళ్లు అభినందనలు తెలుపుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలివే.. గంభీర్ దెబ్బ !
Arshdeep : అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు.. ఒకే ఓవర్‌లో 7 వైడ్లు, 13 బంతులు ! గంభీర్ సీరియస్