న్యూజిలాండ్ తో టీ20 సిరీస్... ధావన్ స్థానంలో ఎవరు..?

By telugu teamFirst Published Jan 22, 2020, 7:58 AM IST
Highlights

 ధవన్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో టీం ఇండియా వెళ్లిన న్యూజిలాండ్ పర్యటన నుంచి అతన్ని తప్పించారు. ధవన్ స్థానంలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కి టీ-20 జట్టులో చోటు కల్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 

న్యూజిలాండ్ తో మరో రెండు రోజుల్లో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కి ఇప్పటికే ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమయ్యారు. ఈ విషయం తెలిసిందే. అయితే... ఇప్పుడు ధావన్ స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేస్తున్నారనే విషయం ఆసక్తిగా మారింది. సంజు శాంసన్ కి చోటు ఇస్తారా లేదా పృథ్వీ షాకి ఇస్తారా అనే విషయంపై తీవ్ర చర్చలు కూడా జరిగాయి. అయితే... బీసీసీఐ మాత్రం సంజు శాంసన్ కే ఓటు వేసింది. 

 ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో శిఖర్ ధావన్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ధవన్ భుజం భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అతన్ని వెంటనే మైదానం నుంచి తీసుకువెళ్లి చికిత్స అందించారు. అతని స్థానంలో యుజవేంద్ర చాహల్ ఫీల్డింగ్ చేయగా.. కేఎల్ రాహుల్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేశాడు.

Also Read ఆ జోన్ నుంచి మాత్రం టీం ఇండియా బయటపడగలిగింది: విరాట్ కోహ్లీ..


 
అయితే ధవన్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో టీం ఇండియా వెళ్లిన న్యూజిలాండ్ పర్యటన నుంచి అతన్ని తప్పించారు. ధవన్ స్థానంలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కి టీ-20 జట్టులో చోటు కల్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 

ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ-20 సిరీస్‌లో దాదాపు 73 మ్యాచ్‌ల తర్వాత శాంసన్‌కి తుది జట్టులో చోటు లభించింది. కానీ, అతను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. దీంతో అతనికి మరోసారి జట్టులో చోటు లభించదని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు ధవన్ గాయపడటంతో అతన్ని టీ-20 జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

click me!