పొగమంచు కారణంగా ఆటకు అంతరాయం.. అంతలోనే మంచు తొలిగిపోవడంతో తిరిగి ప్రారంభమైన ఆట... ఫలితం తేలాలంటే 20 ఓవర్ల పాటు ఆట సాగాల్సిందే..
ధర్మశాలలో ఇండియా- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌కి వాతావరణం కారణంగా అంతరాయం కలిగింది. 274 పరుగుల లక్ష్యఛేదనలో 15.4 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది భారత జట్టు. ఈ దశలో దట్టమైన పొగ మంచు కమ్మేయడంతో న్యూజిలాండ్ ప్లేయర్లు అభ్యంతరం తెలిపారు. కొద్దిసేపటికి భారత బ్యాటర్లు కూడా బంతి కనిపించడం లేదని అభ్యంతరం తెలపడంతో ఆటను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు..
కొద్దిసేపటికే పొగ మంచు కాస్త తొలిగిపోవడంతో ఆట తిరిగి ప్రారంభం అయ్యింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ రిజల్ట్ తేల్చాలంటే కనీసం 20 ఓవర్ల పాటు టీమిండియా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మ్యాచ్ రద్దు చేసి, చెరో పాయింట్ ఇస్తారు.
274 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కింది. 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసిన రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కి 71 పరుగులు జోడించాడు. రోహిత్ శర్మను బౌల్డ్ చూసిన లూకీ ఫర్గూసన్, ఆ తర్వాతి ఓవర్‌లో శుబ్‌మన్ గిల్‌ని పెవిలియన్ చేర్చాడు.
31 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, అత్యంత వేగంగా 2 వేల వన్డే పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రేయాస్ అయ్యర్ వస్తూనే న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 9 బంతుల్లో 5 ఫోర్లతో 21 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి విరాట్ కోహ్లీ 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు..