టీమిండియా చాలా స్ట్రాంగ్, ఈ విజయం అద్భుతం.. ఆనందంలో విలియమ్సన్

By telugu teamFirst Published Feb 12, 2020, 11:14 AM IST
Highlights

ఎంతో స్ట్రాంగ్ టీమ్ పై తాము గెలవడం అద్భుతమంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇదే జోష్ ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ లో కూడా కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ సేనను 3-0 తో వైట్ వాష్ చేసిన తర్వాత కేన్ మీడియాతో మాట్లాడాడు.
 

వన్డే సిరీస్ ని టీమిండియా చేజార్చుకుంది. అప్పటి వరకు అన్ని సీరిస్ లు వరసగా గెలుస్తూ వచ్చిన కోహ్లీ సేన వన్డే సిరీస్ లో పూర్తిగా ఢీలా పడిపోయింది. న్యూజిలాండ్ వైట్ వాష్ చేసేసింది. టీమిండియా పై సిరీస్ గెలవడంపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు.

ఎంతో స్ట్రాంగ్ టీమ్ పై తాము గెలవడం అద్భుతమంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇదే జోష్ ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ లో కూడా కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ సేనను 3-0 తో వైట్ వాష్ చేసిన తర్వాత కేన్ మీడియాతో మాట్లాడాడు.

Also Read చెత్తగా ఏమీ ఆడలేదు కానీ....: కివీస్ పై ఓటమిపై విరాట్ కోహ్లీ స్పందన...

ఈ సిరీస్ లో తమ జట్టు అద్భుతంగా రాణించిందని విలియమ్సన్ పేర్కొన్నాడు. భారత్ తమను చాలా ఒత్తిడిలోకి నెట్టిందన్నాడు. కానీ తమ కుర్రాళ్లు బంతితో మాయాజాలం చేసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారని చెప్పాడు. ఇక రెండో అర్థభాగంలో ఆడిన క్రికెట్ చాలా బాగుందన్నారు. అన్ని ఫార్మాట్లలో టీమిండియా పటిష్టమైన జట్టని తమకు తెలుసన్నాడు. అలాంటి పెద్ద జట్టుపై విజయం సాధించడం తమకు చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇదే జోరు కొనసాగించి ఆస్ట్రేలియాపై కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

కాగా.. మూడో వన్డేలో 80 పరుగులు చేసిన హెన్రీ నికోల్స్ విజయంలో కీలక ప్రాత పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.సిరీస్ గెలవడంలో శుభారంభాలు కలిసొచ్చాయన్నాడు. టీ20 సిరీస్ తర్వాత పుంజుకొని వన్డే సిరీస్ గెలవడం చాలా సంతోషంగా అనిపించిదన్నాడు. మార్టిన్ గుప్తిల్ దూకుడుగా ఆడిన విధానం తమకు బాగా కలిసొచ్చిందన్నాడు.

click me!