జిమ్మీ పైనే ట్రోల్సా.. అస్సలు ఛాన్స్ ఇవ్వడుగా..!

Published : Mar 30, 2021, 09:44 AM ISTUpdated : Mar 30, 2021, 09:47 AM IST
జిమ్మీ పైనే ట్రోల్సా.. అస్సలు ఛాన్స్ ఇవ్వడుగా..!

సారాంశం

తొలి మ్యాచ్   విజయం మాత్రం ఆస్ట్రేలియాకి దక్కిన  క్రమంలో జిమ్మీ ని మ్యాక్స్ వెల్ ట్రోల్ చేయాలని ప్రయత్నించగా.. దానికి జీమ్మీ సింపుల్ గా కౌంటర్ ఇచ్చాడు. తనను ట్రోల్ చేయడం అంత సులభమేమీ కాదని తన ట్వీట్ తో నిరూపించాడు.

న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్... మైదానంలోకి అడుగుపెట్టాక ఎలా చెలరేగిపోతాడో అందరికీ తెలిసిందే. అంతేకాదు.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. తనకు నెటిజన్లు చేసే కామెంట్స్ కి వెంటనే రిప్లై ఇస్తూ ఉంటాడు. అంతేకాదు.. ఇతర క్రికెటర్లను కూడా ట్రోల్ చేస్తూ ఉంటాడు. అయితే.. తనను ట్రోల్ చేయాలని ప్రయత్నించిన ఆస్ట్రేలియా క్రికెటర్  గెలెన్ మ్యాక్స్ వెల్ కి మాత్రం ఊహించని కౌంటర్ ఇచ్చాడు.

ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కోసం తలపడిన సంగతి తెలిసిందే. అయితే.. ఒక మ్యాచ్ ఆస్ట్రేలియా విజయం సాధించగా... చివరగా సిరీస్ మాత్రం న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్   విజయం మాత్రం ఆస్ట్రేలియాకి దక్కిన  క్రమంలో జిమ్మీ ని మ్యాక్స్ వెల్ ట్రోల్ చేయాలని ప్రయత్నించగా.. దానికి జీమ్మీ సింపుల్ గా కౌంటర్ ఇచ్చాడు. తనను ట్రోల్ చేయడం అంత సులభమేమీ కాదని తన ట్వీట్ తో నిరూపించాడు.

 

దీంతో.. దానికి కౌంటర్ గా న్యూజిలాండ్ కప్ గెలిచిన ఫోటోని షేర్ చేసి మరీ..‘‘ Haha nah you get used to lifting stuff after a while’’ అంటూ మ్యాక్స్ వెల్ కి కౌంటర్ ఇచ్చాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో జిమ్మీ 70 పరుగులు చేసి జట్టు విజయానికి సహకరించాడు. అంతేకాదు.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో సైతం న్యూజిలాండ్ టాప్ లో నిలవడం గమనార్హం. 

 

ఇటీవల.. ఓ ఇండియన్ అభిమాని.. జిమ్మీని ముంబయి ఇండియన్స్ జట్లులో ఎప్పుడు చేరుతున్నారంటూ మెసేజ్ చేయగా.. తాను వస్తున్నానని.. అయితే... కార్గో షిప్ ఆగిపోవడంతో తాను ఇరుక్కుపోయానంటూ సరదాగా ట్వీట్ చేశాడు. దానికి మ్యాక్స్ వెల్ ట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. ‘ అవును నిజమే.. 46,44,46 బ్యాగులు మోయాలంటే కష్టమే’ అంటూ కౌంటర్ వేశాడు. అన్నింటికీ కలిపి తాజా ట్వీట్ తో మ్యాక్స్ వెల్ జిమ్మీ కౌంటర్ ఇచ్చేశాడు. 

PREV
click me!

Recommended Stories

Ravindra Jadeja : గెలిస్తే కింగ్.. లేదంటే ఇంటికే ! స్టార్ ప్లేయర్ కు బిగ్ టెస్ట్
IND vs NZ : మరోసారి న్యూజిలాండ్ చేతిలో బలి.. కుల్దీప్ కెరీర్‌లో రెండోసారి ఇలా!