IND vs ENG : 5 వికెట్లు తీసిన త‌ర్వాత కుల్దీప్ యాద‌వ్ రియాక్ష‌న్ ఎంటో తెలుసా?

By Mahesh Rajamoni  |  First Published Mar 7, 2024, 8:58 PM IST

IND vs ENG : ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టులో తొలి రోజు టీమిండియా పైచేయి సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించింది. కుల్దీప్ యాద‌వ్, ర‌విచంద్ర‌న్ అశ్విన్ సూప‌ర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ 218 ప‌రుగుల‌కే కుప్పకూలింది. 
 


IND vs ENG - Kuldeep Yadav: భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో చివ‌రిదైన 5వ మ్యాచ్ ధ‌ర్మ‌శాల‌లోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జ‌రుగుతోంది. తొలి రోజు భార‌త్ బౌల‌ర్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో ఇంగ్లాండ్ 218 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ముఖ్యంగా కుల్దీప్ యాద‌వ్ ఇంగ్లాండ్ స్టార్ ప్లేయ‌ర్లు ఔట్ చేసి ప్ర‌త్య‌ర్థి టీమ్ ను దెబ్బ‌తీశాడు. ఐదు వికెట్లు తీసుకుని ఇంగ్లాండ్ బ్యాటింగ్ ను కుల్దీప్ కూల్చేశాడు. త‌న టెస్టు కెరీర్ లో 50 వికెట్లు తీసుకుని మ‌రో ఘ‌న‌త సాధించాడు.

ధ‌ర్మశాల టెస్టులో తొలి రోజు భార‌త్ పై చేయి సాధించ‌డంలో కుల్దీప్ యాద‌వ్ కీల‌క పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్ తో 5 వికెట్లు తీసుకోవ‌డం గురించి కుల్దీప్ యాద‌వ్ స్పందిస్తూ.. ప్ర‌స్తుతం తాను ఆట‌ను ఆస్వాదిస్తున్నాన‌నీ, దీంతో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇస్తున్నాన‌ని చెప్పాడు. "నిజం చెప్పాలంటే 2021లో నా శస్త్రచికిత్స తర్వాత నేను చాలా కష్టపడ్డాను. ఇప్పుడు నేను పొందుతున్న ప్రతిఫలం ఇది. నేను నా పేస్‌పై పనిచేశాను, మీరు భారతదేశంలో టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఇది చాలా ముఖ్యం. నేను నా బౌలింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. అందుకే ఇలాంటి మెరుగైన ఫ‌లితాలు వ‌స్తున్నాయి" అని చెప్పాడు.

Latest Videos

undefined

IND VS ENG : గిల్ మామ అదరగొట్టాడు.. క్రికెట్‌ చరిత్రలోనే సూపర్‌ క్యాచ్‌.. వీడియో

అలాగే, జాక్ క్రాలీ వికెట్ తీసుకున్న త‌ర్వాత త‌న‌లో మ‌రింత జోష్ వ‌చ్చింద‌ని చెప్పాడు. ఎందుకంటే జాక్ సిరీస్ అంతటా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడ‌నీ, స్పిన్‌లో మంచి ఆడుతున్న ప్లేయ‌ర్.. అయినా జాక్ వికెట్ గురించి ఆలోచించ‌లేద‌నీ, త‌న నైపుణ్యం.. బౌలింగ్ వైవిధ్యంపై ఆధారపడ్డాన‌ని చెప్పాడు. చిన్న‌త‌నం నుంచే తాను వైవిధ్యం గురించి ఆలోచ‌న చేస్తున్నాన‌నీ, నెమ్మదిగా, నెమ్మదిగా స్పిన్నర్‌గా పరిణతి చెందాన‌ని చెప్పాడు. గ్రౌండ్ లో ప్లేయ‌ర్ల అంద‌రీ నుంచి మంచి స‌పోర్టు ఉంటుంద‌నీ, య‌ష్ భాయ్ (అశ్విన్) కొన్ని విష‌యాలు చెప్ప‌డంతో పాటు బౌలింగ్ ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటార‌ని కుల్దీప్ యాద‌వ్ చెప్పాడు.

Team India: 100 టెస్టు మ్యాచ్ లు ఆడిన భార‌త క్రికెట‌ర్లు ఎవ‌రో తెలుసా?

click me!