IND vs ENG : ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టులో తొలి రోజు టీమిండియా అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. భారత బౌలర్లు విజృంభణతో 218 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది. శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్ తో అదరగొట్టాడు.
IND vs ENG - Shubman Gill Super Catch : భారత్ -ఇంగ్లాండ్ మధ్య ధర్మశాల వేదికగా 5వ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. అద్భుతమైన ఆటతీరుతో తొలి రోజు భారత్ తన అధిపత్యం చెలాయించింది. మన బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్ కేవలం 218 పరుగులకే ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసుకున్నాడు. తన టెస్టు కెరీర్ లో 50 వికెట్లు తీశాడు. అలాగే, 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ సైతం 4 వికెట్లతో మెరిశాడు. అయితే, ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్ తో అదరగొట్టాడు.
శుభ్‌మన్ గిల్ అందుకున్న కళ్లు చెదిరే క్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోనుంది. తో మెరిశాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 18 ఓవర్‌లో 6 బంతిని కుల్దీప్ యాదవ్ బెన్ డకెట్‌కు గుగ్లీగా వేశాడు. అయితే, బెన్ డకెట్ లాంగ్ ఆఫ్ మీదగా భారీ షాట్ కొట్టగా.. మిస్ కనెక్ట్ తో బౌండరీని అందుకోలేక గాల్లోకి వెళ్లింది. కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టాడు. తన అద్భుతమైన ఫీల్డింగ్ సూపర్ క్యాచ్ అందుకున్న గిల్ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
undefined
TEAM INDIA: 100 టెస్టు మ్యాచ్ లు ఆడిన భారత క్రికెటర్లు ఎవరో తెలుసా?
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. మంచి ఆరంభం లభించింది కానీ, తొలి వికెట్ పడిన తర్వాత వరుసగా ఇంగ్లాండ్ ప్లేయర్లు పెవిలియన్ కు బాటపట్టారు. భారత్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను కుప్పకూల్చింది. కుల్దీప్ యాదవ్ 5, అశ్విన్ 4, జడేజాకు ఒక వికెట్ దక్కింది. 218 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ కాగా, జాక్ క్రాలీ 79 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో శుభారంభం చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు హాఫ్ సెంచరీలతో రాణించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 135/1 పరుగులతో క్రీజులో రోహిత్ శర్మ (52* పరుగులు), గిల్ (26* పరుగులు) లు ఉన్నారు.
Catching game 🔛 point! ⚡️ ⚡️
Follow the match ▶️ https://t.co/jnMticF6fc | | | pic.twitter.com/DdHGPrTMVL
Ind vs Eng: ఇంగ్లాండ్ ను కూల్చేసిన కుల్దీప్ యాదవ్ !