ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ కప్ 2023 ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో చిన్న టెన్షన్ మొదలయ్యింది.
అహ్మదాబాద్ : ప్రపంచ కప్ 2023 విజేతలెవరో నేడు తేలిపోనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ వేదికన తుదిపోరు జరగనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమన్నదే ఎరగని టీమిండియా... ఆరంభంలో కాస్త తడబడినా తర్వాత పుంచుకుని విజయాల బాట పట్టిన ఆస్ట్రేలియా ఇవాళ ఫైనల్లో తలపడనున్నాయి. సమఉజ్జీల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కు ఎక్కడ వాతావరణం ఆటంకం కలిగిస్తోందనని అభిమానులు కంగారుపడుతున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లో నేటి వెదర్ కండిషన్ ను వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇవాళ అహ్మదాబాద్ లో వాతావరణం చాలా ప్రశాంతంగా వుటుందని... వర్షం కురిసే అవకాశాలు ఏమాత్రం లేవని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు కూడా సాధారణంగానే నమోదవుతాయని... గరిష్టంగా 34 డిగ్రీలు, కనిష్టంగా 20 డిగ్రీ సెల్సియస్ గా వుండే అవకాశం వుందన్నారు. వాతావరణ శాఖ ప్రకటన క్రికెట్ అభిమానుల్లోని కలవరాన్ని దూరంచేసింది.
undefined
ఇటీవల న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచ్ కు వర్షం ఆటంకం సృష్టించింది. బెంగళూరులో అకాలవర్షం కారణంగా చిన్నస్వామి స్టేడియంలో 400 పైచిలుకు పరుగులు సాధించినప్పటికీ కివీస్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వర్షంతో ఆటకు ఆటంకం కలగడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితాన్ని ప్రకటించారు. దీంతో 401 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికి పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది న్యూజిలాండ్.
Read More IND VS AUS : ఆస్ట్రేలియాకు అదే బలం... తప్పుచేసారో భారీ మూల్యం : రోహిత్ సేనకు యువరాజ్ హెచ్చరిక
ఇలాంటి అనుభవాలు మ్యాచ్ ఫలితాన్ని ఒక్క వర్షం తారుమారు చేస్తుందని నిర్దారిస్తున్నాయి. దీంతో ఎక్కడ అహ్మదాబాద్ లో వర్షం పడి మంచి ఫామ్ లో వున్న టీమిండియా విజయావకాశాలను దెబ్బతీస్తుందోనని ఫ్యాన్స్ భయపడ్డారు. ఆ భయాన్ని పటాపంచలు చేస్తూ ఇవాళ అహ్మదాబాద్ లో వర్షం పడే అవకాశాలే లేవని వాతావరణ శాఖ ప్రకటించింది.