ఆస్ట్రేలియాతో సిరీస్.. శిఖర్ ధావన్ అరుదైన రికార్డ్

Published : Jan 15, 2020, 08:59 AM IST
ఆస్ట్రేలియాతో సిరీస్.. శిఖర్ ధావన్ అరుదైన రికార్డ్

సారాంశం

తొలి వన్డేలో 74 పరుగులు చేసిన ధావన్.. ఆ జట్టుపై వెయ్యి పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. అతడి కంటే ముందు సచిన్ టెండూల్కర్(3077), రోహిత్ శర్మ(2047), విరాట్ కోహ్లీ(1727), ఎంఎస్ ధోనీ (1660) ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో 66 బంతుల్లో 9 ఫోర్లతో ధవన్ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. 

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మరో రికార్డ్ సృష్టించాడు. ముంబయిలోని వాంఖడే వేదికగా మంగళవారం టీమిండియా... ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం తలపడిన సంగతి తెలిసిందే. కాగా... ఈ తొలి వన్డేలో ధావన్ రికార్డు సాధించాడు. 

తొలి వన్డేలో 74 పరుగులు చేసిన ధావన్.. ఆ జట్టుపై వెయ్యి పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. అతడి కంటే ముందు సచిన్ టెండూల్కర్(3077), రోహిత్ శర్మ(2047), విరాట్ కోహ్లీ(1727), ఎంఎస్ ధోనీ (1660) ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో 66 బంతుల్లో 9 ఫోర్లతో ధవన్ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. 

Also Read ఒలింపిక్స్ వేళ కలవరపెడుతున్న భారత షట్లర్లు...ఈ సారైనా మెరిసేనా?...

వన్డేల్లో ధావన్‌కు ఇది 28వ అర్ధ శతకం. కాగా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 255 పరుగుల విజయ లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా 37.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (128), కెప్టెన్ అరోన్ ఫించ్ (110) అజేయ సెంచరీలతో జట్టుకు అద్వితీయమైన విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ముందంజలో ఉంది.
 
PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ