
India vs Australia Champions Trophy 2025 Semi-Final: దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీఫైనల్‌లో భారత్-ఆస్ట్రేలియాలు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో త్వరగానే ట్రావిస్ హెడ్ తలనొప్పి పోయింది. దూకుడుగా ఆడుతున్న అతన్ని భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదట బౌలింగ్ చేస్తోంది. ప్రారంభంలో ఆసీస్ భారత పేసర్లు ఇబ్బంది పెట్టారు. జట్టులోకి కొత్తగా వచ్చిన కూపర్ కొన్నోలీని షమీ త్వరగానే ఔట్ చేశాడు. 3 ఓవర్లకు ఆసీస్ 4 పరుగుల వద్ద అతని వికెట్ కోల్పోయింది.
అయితే, ఆ తర్వాత ట్రావిస్ హెడ్ భారత పేసర్లను టార్గెట్ చేశాడు. వరుస బౌండరీలు బదుతూ పరుగులు రాబట్టాడు. 2023 ప్రపంచ కప్ మాదిరిగా ట్రావిస్ హెడ్ మరోసారి భారత్ కు తలనొప్పిగా మారుతున్నాడు.ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పాడు.
కేవలం 38 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. మరింత దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. అయితే, అప్పుడు వరుణ్ చక్రవర్తి బాల్ తో ఎంటరయ్యాడు. వచ్చిన వెంటనే ట్రావిస్ హెడ్ ను ఔట్ చేశాడు. భారత మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ 39 పరుగుల వద్ద శుభ్ మన్ గిల్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. తన ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం ఆసీస్ 80-2 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (wk), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.