యాషెస్ సీరిస్‌: ఆసిస్ పై ఇంగ్లాండ్ విజయం...ఆ దేశాధినేతలకు తెలిపింది మోదీనే

By Arun Kumar PFirst Published Aug 26, 2019, 7:00 PM IST
Highlights

యాషెస్ సీరిస్ కు సంబంధిన ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఇంగ్లాండ్ గెలుపు గురించి ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కు  కూడా మన ప్రధాని మోదీ చెబితేనే తెలిసిందట.

ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న యాషెస్ సీరిస్ మూడో టెస్ట్ లో ఆతిథ్య జట్టు అద్భుత విజయం సాధించింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్(135 పరుగులు నాటౌట్) పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. చివరకు 11వ నంబర్ ఆటగాడితో కలిసి ఏకంగా 73పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మరీ స్టోక్స్ తమ జట్టును గెలిపించుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లాండ్ సత్తా చాటడమే కాదు ఐదు టెస్టుల ఈ సీరిస్ లో 1-1తో సమానంగా నిలిచింది.  

అయితే ఈ మ్యాచ్ ఫలితం వెలువడిన సమయంలో ఇరు దేశాల ప్రధానులు సమావేశమయ్యారు. ప్రాన్స్ వేదికన జరుగుతున్న జీ7 దేశాల సదస్సులో భాగంగా ఈ భేటీ జరిగింది. అధికారిక సమావేశం కావడంతో బయటివారు గానీ, మీడియా సభ్యులు కానీ వారిని కలిసే అవకాశం లేకుండా పోయింది. అయితే భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇంగ్లాండ్ విజయం గురించి తెలుసుకుని మొదట ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కు శుభాకాంక్షలు తెలిపాడట. మోదీ నుండే మొదట ఈ వార్త గురించి తెలుసుకున్న బోరిస్ ఆ తర్వాత తన ఐపాడ్ తెప్పించుకుని తమ  జట్టు విజయానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నట్లు సమాచారం. 

ఇలా మన ప్రధాని మోదీ ఈ వార్తను మొదట బ్రేక్ చేశాడన్నమాట. సాంకేతికతను అధికంగా ఉపయోగించే అలవాటువల్లే మోదీ ఈ యాషెస్ సీరిస్ ఫలితాన్ని అందరికంటే ముందే తెలుసుకోగలిగారు. ఈ  మ్యాచ్ లో పాలుపంచుకుంటున్న దేశాల అధినేతల కంటే మోదీ దీని గురించి తెలుసుకోవడం విశేషం. 

అంతర్జాతీయ వాణిజ్యం, భద్రత మరియు పర్యావరణం తదితన అంశాలపై జీ7 దేశాధినేతల సదస్సు ప్రాన్స్ లో జరుగుతోంది. ఇందులో భారత ప్రధాని మోదీతో పాటు వివిధ దేశాల అధినేతలు కూడా పాల్గొన్నారు. ఈ  సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిస్ లు సమావేశమయ్యారు. ఈ సమయంలో యాషెస్ సీరిస్ మూడో టెస్ట్ ను ఇంగ్లాండ్ గెలుచుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధానికి మోదీ తెలియజేయడం విశేషం. 

ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని కూడా బోరిస్ జాన్సన్ కు శుభాకాంక్షలు తెలిపాడు. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ తమ జట్టే విజయాన్ని సాధించి సీరిస్ ను  కైవసం చేసుకోవాలని ఇరు దేశాల ప్రధానులు కోరుకున్నారు. 

click me!