వెస్టిండిస్ పై గెలుపు క్రెడిట్ అతడిదే: కోహ్లీ

By Arun Kumar PFirst Published Aug 26, 2019, 5:03 PM IST
Highlights

వెస్టిండిస్ పై తొలిటెస్ట్ విజయానికి జట్టు సమిష్టి పోరాటమే కారణమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. అయితే మ్యాచ్ ను మలుపుతిప్పే ప్రదర్శన చేసింది మాత్రం ఇషాంత్ శర్మేనని అన్నాడు. 

వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా విజయయాత్ర కొనసాగుతోంది. టీ20, వన్డే సీరిసులను ఓటమన్నదే ఎరగకుండా కైవసం చేసుకున్న కోహ్లీసేన టెస్ట్ సీరీస్ లోనే అదే దిశగా ప్రయత్నిస్తోంది. రెండు టెస్టు మ్యాచుల సీరిస్ లో ఇప్పటికే 1-0 ఆధిక్యాన్ని సాధించిన భారత్ రెండో టెస్టులోనూ విజయం సాధించి ఈ సీరిస్ ను క్లీన్ స్వీప్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకు కేవలం మరో అడుగుదూరంలో మాత్రమే నిలిచింది. 

ఆంటిగ్వా వేధికన జరిగిన తొలి టెస్ట్ లో భారత జట్టు ఆటతీరును పరిశీలిస్తే రెండో టెస్టులో కూడా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.  టీమిండియా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తుండటం రెండో టెస్టులో కూడా కలిసిరానుంది. ఇదే ఆటతీరును రిపీట్ చేస్తే కోహ్లీసేన గెలుపు నల్లేరుపైన నడకే కానుంది. 

మొదటిటెస్ట్ లో టీమిండియా ఏకంగా 318 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆటగాళ్లను మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తాడు. ముఖ్యంగా ఇషాంత్ శర్మ మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్ ను మలుపుతిప్పాడని అన్నాడు. అంతేకాకుండా సెకండ్ ఇన్నింగ్స్ లోనూ 3 వికట్లతో తనవంతు సాయం చేశాడు. ఇలా మొత్తంగా ఎనిమిది వికెట్లతో మెరిసిన అతడికే ఈ గెలుపు క్రెడిత్ మొత్తం దక్కుతుందని కోహ్లీ పేర్కొన్నాడు. 

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అదిరిపోయే బౌలింగ్ స్పెల్ వేసిన బుమ్రాను కూడా కోహ్లీ కొనియాడాడు. అలాగే  హాఫ్ సెంచరీ, సెంచరీలతో రాణించిన అజింక్య రహానే, 93 పరుగులతో సత్తాచాటికి హనుమ విహారీలపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. తాను కెప్టెన్ గా కేవలం వ్యూహాలు మాత్రమే రచించగలనని...వాటిని అమలు చేయడంలో మాత్రం జట్టు సభ్యుల పనేనని అన్నాడు. ఆ విషయంలో జట్టులోని ఆటగాళ్లందరు  తనకు సహకరించిడం వల్లే వరుస విజయాలతో దూసుకుపోవడం సాధ్యపడుతోందని కోహ్లీ వెల్లడించాడు.  
 

click me!