వీరూ, యువీ రావాల్సిందే... లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఇండియా మహరాజాస్ జట్టుకి...

By Chinthakindhi RamuFirst Published Jan 25, 2022, 1:25 PM IST
Highlights

ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఓడిన ఇండియా మహరాజాస్... జనవరి 26న వరల్డ్ జెయింట్స్‌తో ఆఖరి మ్యాచ్ ఆడనున్న ఇండియా మహరాజాస్...

లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్‌సీ) టోర్నీలో ఇండియా మహరాజాస్ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడింది. ఆసియా లయన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఓడింది ఇండియా మహరాజాస్ జట్టు. టాస్ గెలిచి, ఆసియా లయన్స్ జట్టుకి బ్యాటింగ్ అప్పగించాడు ఇండియా మహరాజాస్ కెప్టెన్ మహ్మద్ కైఫ్...

నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోరు చేసింది ఇండియా మహరాజాస్ జట్టు. ఇన్నింగ్స్ మొదటి బంతికే దిల్షాన్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు భారత మాజీ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ. రొమేశ్ కలువితరణ 15 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేయగా, మహ్మద్ యూసఫ్ 24 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేశాడు...

ఉపుల్ తరంగా 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేయగా, అస్గర్ ఆఫ్ఘాన్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 69 పరుగులు చేసి మోత మోగించాడు. కెప్టెన్ మిస్బా వుల్ హక్ 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

194 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇండియా మహరాజాస్ జట్టు నమాన్ ఓజా 8 బంతుల్లో 4 పరుగులు, బద్రీనాథ్ 8 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసి అవుట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 25 బంతుల్లో 7 ఫోర్లతో 35 పరుగులు చేసిన వసీం జాఫర్ కూడా పెవిలియన్ చేరడంతో 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఇండియా మహరాజాస్..

కెప్టెన్ మహ్మద్ కైఫ్ 4 బంతుల్లో 1 పరుగు చేసి నిరాశపరచగా యూసఫ్ పఠాన్ 19 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేశాడు. స్టువర్ట్ బిన్నీ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేశాడు...

ఆవిష్కర్ సల్వీ 13 బంతుల్లో 2 సిక్సర్లతో 14 పరుగులు చేయగా మన్‌ప్రీత్ గోనీ 21 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. మునాఫ్ పటేల్ డకౌట్ కాగా నిఖిల్ చోప్రా 2 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది ఇండియా మహరాజాస్ జట్టు...

తొలి మ్యాచ్‌లో ఆసియా లయన్స్‌పై విజయం సాధించిన ఇండియా మహరాజాస్, ఆ తర్వాత వరల్డ్ లయన్స్, ఆసియా లయన్స్ చేతుల్లో వరుస మ్యాచుల్లో ఓడింది. రేపు (జనవరి 26న) వరల్డ్ జెయింట్స్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది ఇండియా మహరాజాస్. ఈ మ్యాచ్ గెలిస్తే రన్‌రేట్ ఆధారంగా ఫైనల్ చేరే అవకాశం పొందుతుంది...

లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీకి ఎంపికైనప్పటికీ మ్యాచుల్లో బరిలో దిగిన కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్‌లపైనే ఇండియా మహరాజాస్ జట్టు ఆశలు పెట్టుకుంది. వీరితో పాటు ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్ వంటి ప్లేయర్లు బరిలో దిగితే వరల్డ్ జెయింట్స్ ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు...

click me!