
త్వరలో యూఏఈ వేదికగా జరిగే అండర్-19 ఏసీసీ ఆసియా కప్ కోసం ఆలిండియా జూనియర్ సెలక్షన్ కమిటీ.. భారత జట్టును ఎంపిక చేసింది. డిసెంబర్ 23 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. జనవరి 7 దాకా జరుగనుంది. ఈ నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ.. 20 మందితో కూడిన జట్టును గురువారం ప్రకటించింది. యశ్ ధుల్ సారథ్యం వహిస్తున్న ఈ జట్టులో కుర్రాళ్ల ప్రదర్శన ఆధారంగా వారిని వచ్చే ఏడాది జరుగబోయే ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లో ఎంపిక చేసే అవకాశముంది.
ఆసియా కప్ కు సన్నాహకంగా బెంగళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో జరుగబోయే ప్రాక్టీస్ సెషన్ కు కూడా సెలెక్టర్లు జట్టును ఎంపిక చేశారు. 25 మందితో కూడిన జట్టును కూడా సెలెక్టర్లు ప్రకటించారు. ఈ ప్రాక్టీస్ సెషన్ ఈనెల 11 నుంచి 19 దాకా జరుగనుంది.
ఆసియా కప్ కు భారత అండర్-19 జట్టు : హర్నూర్ సింగ్ పన్ను, అంగ్క్రిష్ రఘువంశీ, అన్ష్ గొసాయ్, ఎస్కే రషీద్, యశ్ ధుల్ (కెప్టెన్), అన్నేశ్వర్ గౌతమ్, సిద్ధార్థ యాదవ్, కౌశల్ తంబే, నిషాంత్ సింధు, దిన్నేశ్ బన (వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్ (వికెట్ కీపర్), రాజంగడ్, రాజ్వర్దన్ హంగర్గ్రేకర్, గర్వ్ సంగ్వన్, రవి కుమార్, రిషిత్ రెడ్డి, మనవ్ పరఖ్, అమృత రాజ్ ఉపాధ్యాయ్, విక్కీ ఓస్వల్, వాసు (ఇంకా ఫిట్నెస్ టెస్ట్ క్లీయర్ కావాల్సి ఉంది)
స్టాండ్ బై ప్లేయర్లు : అయుష్ సింగ్ ఠాకూర్, ఉదయ్ సహరన్, శశ్వత్ దంగ్వల్, ధనుష్ గౌడ, పిఎం సింగ్ రాథోడ్
ఈ ఏడాది విను మాన్కడ్ ట్రోఫీలో అదరగొట్టిన ధుల్.. ఆ టోర్నీలో హయ్యస్ట్ రన్ స్కోరర్. ఐదు మ్యాచులలో అతడు 302 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి.
ఇక వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరుగబోయే ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ కోసం త్వరలోనే జట్టును ఎంపిక చేసే అవకాశమున్నట్టు సెలెక్షన్ కమిటీ సభ్యులు తెలిపారు.