
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత-ఏ జట్టు లో కరోనా
Omicron variant కలకలం రేపింది. జట్టు కోచింగ్ సిబ్బందిలో ఇద్దరికి
Corona positive నిర్ధారణ అయినట్లు వార్తలు రావడంతో భారత శిబిరంలోని ఆటగాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. త్వరలో South Africaలో పర్యటించాల్సిన టీమిండియా సైతం ఈ వార్త విని ఆందోళనకు గురి అయింది.
అయితే, ఆ ఇద్దరు కోచింగ్ సిబ్బందికి రెండోసారి కోవిడ్ పరీక్ష నిర్వహించగా, అందులో నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే… బ్లూఫాంటేన్ వేదికగా భారత్-ఏ, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరి నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు అందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షలో తొలుత ఇద్దరు TeamIndia Coach లకు కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ పాటిటివ్ గా తేలి, రెండోసారి జరిగిన పరీక్షల్లో నెగటివ్ వచ్చినట్లు ఓ ప్రముఖ దినపత్రిక పేర్కొంది. ప్రాథమిక పరీక్ష ఫలితాలు తప్పు అని క్రికెట్ దక్షిణాఫ్రికా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నిర్ధారించినట్లు సదరు పత్రిక తెలిపింది. భారత బృంద సభ్యులందరికీ నెగటివ్ రావడంతో మ్యాచ్ ను యధాతధంగా కొనసాగిస్తున్నారు.
False positiveవచ్చిన ఇద్దరు కోచ్ లను క్వారంటైన్ లకు తరలించినట్లు తెలుస్తోంది. కాగా, భారత-ఏ బౌలింగ్ కోచ్ గా సాయిరాజ్ బహుతులే, బ్యాటింగ్ కోచ్ గా సితాన్షు కోటక్, ఫీల్డింగ్ కోచ్గా శుభ్ దీప్ ఘోష్ లను బిసీసీఐ దక్షిణాఫ్రికాకు పంపింది. ఇదిలా ఉంటే, కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ ప్రకంపనల కారణంగా భారత సీనియర్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన వారం ఆలస్యంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో తొలి టెస్ట్ డిసెంబర్ 26న, రెండు టెస్టు వచ్చే ఏడాది జనవరి 3న, సిరీస్లో ఆఖరిదైన మూడో టెస్టు జనవరి 11న జరగనున్నాయి. ఆ తర్వాత వన్డే, టి20 సిరీస్ లు ప్రారంభమవుతాయి.
ఇదిలా ఉండగా, భారత వన్డే జట్టు పగ్గాలను కోహ్లీ నుంచి రోహిత్ శర్మకు బదిలీ చేయడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ గురువారం అన్నాడు. ఇదేం కొత్త విషయం కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై భారత మాజీ క్రికెటర్లే కాదు.. పొరుగు దేశంలో ఉన్న ఆటగాళ్లు కూడా స్పందిస్తున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయం ఏమంత ఆశ్చర్యం కలిగించలేదని, ఇది ఊహించిందేనని పాక్ మాజీ సారథి సల్మాన్ భట్ అన్నాడు.
బుధవారం భారత వన్డే కెప్టెన్సీ బాధ్యతలను కోహ్లీ నుంచి రోహిత్ శర్మకు బదిలీ చేసిన నేపథ్యంలో సల్మాన్ భట్ స్పందించాడు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా భట్ మాట్లాడాడు. ‘ఈ నిర్ణయం (వన్డే కెప్టెన్సీ మార్పు) నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఇది కార్డులపై ఉంది. భారత జట్టు టీ20 ల కంటే వన్డేలు, టెస్టులు ఎక్కువగా ఆడుతున్నది. అలాంటి సందర్భంలో అన్ని ఫార్మాట్లలో విరాట్ కెప్టెన్ గా ఉంటే అతడి మీద ఒత్తిడి పెరుగుతున్నది. విరాట్ మీద పని ఒత్తిడిని తగ్గించడానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని నేను భావిస్తున్నాను. కెప్టెన్సీ భారం లేకపోవడంతో ఇకనుంచి కోహ్లీ స్వేచ్ఛగా ఆడే అవకాశముంది.