IND vs WI: ఇక చాలు.. నువ్వు ముందు సచిన్ దగ్గరికి వెళ్లు.. : డకౌట్ అయిన కోహ్లికి దిగ్గజ క్రికెటర్ సూచన

Published : Feb 11, 2022, 03:20 PM IST
IND vs WI: ఇక చాలు.. నువ్వు ముందు సచిన్ దగ్గరికి వెళ్లు.. : డకౌట్ అయిన కోహ్లికి దిగ్గజ క్రికెటర్ సూచన

సారాంశం

Virat Kohli Duck Out: విరాట్ కోహ్లి 71 వ సెంచరీ కోసం అతడి అభిమానులు మరికొద్దికాలం ఆగాల్సిందే. విండీస్  సిరీస్ లో కూడా కోహ్లి ఆ ఫీట్ ను అందుకోలేకపోయాడు. మూడో వన్డేలో ఈ టీమిండియా మాజీ సారథి మరీ దారుణంగా..     

అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో పేలవ ఆటతీరును కొనసాగిస్తూ  డకౌట్ అయిన విరాట్ కోహ్లిపై సామాజిక మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  టీమిండియా సారథి సెంచరీ చేసి దాదాపు రెండేండ్లయింది. 71 సెంచరీ కోసం అతడి అభిమానులు వేయికండ్లతో  ఎదురు చూస్తున్నారు. కానీ కోహ్లి మాత్రం వారిని ప్రతి మ్యాచులో నిరాశకు గురి చేస్తూనే ఉన్నాడు. స్వదేశంలో వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో అయినా సాధిస్తాడేమో అనుకుంటే.. అదీ చేయడం  లేదు. మూడో వన్డేలో  సున్నా పరుగులకే వెనుదిరిగాడు ఈ పరుగుల యంత్రం.. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్..  కోహ్లికి కీలక సూచన చేశాడు. 

తొలి రెండు వన్డేలలో (8, 18)  దారుణంగా విఫలమైన కోహ్లి.. మూడో వన్డేలో డకౌట్ అయ్యాడు. మూడో వన్డేలో రోహిత్ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన  కోహ్లి.. జోసెఫ్ విసిరిన వైడ్ బంతిని వెంటాడి కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

కోహ్లి నిష్క్రమణ  తర్వాత  కామెంటెరీ బాక్స్ లో  వ్యాఖ్యాతగా ఉన్న సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ‘నేను అతడిని సచిన్ టెండూల్కర్ దగ్గరకు వెళ్లమని అడుగుతున్నాను. ఒకవేళ కోహ్లి స్థానంలో నేనుంటే నేను ఓపికగా ఉండేవాడిని.  విరాట్ కోహ్లి నాణ్యమైన ఆటగాడే. అందులో సందేహం లేదు.  అతడి ఫుట్ వర్క్, టెక్నిక్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి.  కానీ కోహ్లికి ఇవాల మరో బ్యాడ్ లక్.  కొన్నిసార్లు మీకు కొంత అదృష్టం కూడా కావాలి...’ అని అన్నాడు. 

 

సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన సచిన్ టెండూల్కర్ కూడా  2004 లో ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శల పాలయ్యాడు. సుమారు ఏడాదిన్నర దాకా సచిన్ క్రీజులోకి రావడం.. వెళ్లడం.. ఇదే జరిగేది. ఇది చూసిన చాలా మంది ఇక మాస్టర్ బ్లాస్టర్ పనైపోయింది అనుకున్నారు. కానీ పడి లేచిన తరంగంలా సచిన్ మళ్లీ  తనను తాను కరెక్ట్ చేసుకున్నాడు.  2004లో ఆస్ట్రేలియా సిరీస్ లో ఫామ్ లోకి వచ్చాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లతో జరిగిన ఓ టెస్టులో తనకు ఎంతో ఇష్టమైన కవర్ డ్రైవ్ షాట్ ఒక్కటి  కూడా ఆడకుండా డబుల్ సెంచరీ చేశాడు లిటిల్ మాస్టర్.  

సచిన్ తో పాటు  హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కూడా తన బ్యాటింగ్ గురించి విరాట్ కోహ్లి మాట్లాడితే మంచిదని గవాస్కర్ తో పాటు మరికొంత మంది సీనియర్ ఆటగాళ్లు కూడా కోహ్లికి సూచిస్తున్నారు. కాగా మూడో వన్డేకు ముందు దక్షిణాఫ్రికా తో వన్డే సిరీస్ లో కూడా  కోహ్లి డకౌట్ అయిన విషయం తెలిసిందే.  స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో  విరాట్ డకౌట్ అయ్యాడు.  వన్డేలలో కోహ్లిని  డకౌట్ చేసిన తొలి స్పిన్నర్ మహారాజే కావడం విశేషం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !