Ind Vs SA: బంతితో మాయ చేసిన శార్ధుల్ ఠాకూర్.. వరుసగా మూడు వికెట్లు.. లంచ్ కు ముందు సఫారీలకు షాక్

Published : Jan 04, 2022, 04:15 PM ISTUpdated : Jan 04, 2022, 04:17 PM IST
Ind Vs SA: బంతితో మాయ చేసిన శార్ధుల్ ఠాకూర్.. వరుసగా మూడు వికెట్లు.. లంచ్ కు ముందు సఫారీలకు షాక్

సారాంశం

Shardul Thakur: ఊరిస్తున్న వాండరర్స్ పిచ్ పై వికెట్ కోసం కష్టపడుతున్న భారత  పేసర్లలో శార్దుల్ ఠాకూర్ కొత్త జోష్ నింపాడు. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు పడగొట్టి సఫారీ టాపార్డర్ ను కకావికలం చేశాడు. 

‘లార్డ్ శార్దుల్ ఠాకూర్’ మాయ చేశాడు. టీమిండియా అభిమానులంతా అతడిని అదే పేరుతో పిలుస్తారు. దక్షిణాఫ్రికాతో వాండరర్స్  వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అతడు నిజంగానే మాయ చేశాడు. నిన్న సాయంత్రం నుంచి విసిగిస్తున్న డీన్ ఎల్గర్, పీటర్సన్ లతో పాటు ప్రమాదకర బ్యాటర్ డసెన్ ను కూడా పెవిలియన్ బాట పట్టించాడు. వరుసగా మూడు వికెట్లు తీసి లంచ్ కు ముందు సఫారీలకు షాకిచ్చిన ఠాకూర్.. టీమిండియాలో జోష్ నింపాడు. లంచ్ కు ముందువరకు సాఫీగా సాగిన  సౌతాఫ్రికా ఇన్నింగ్స్.. అతడి రాకతో కుదేలైంది. కేవలం 5 ఓవర్లే వేసిన అతడు 8 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఆ ఐదు ఓవర్లలో రెండు మెయిడిన్ లు ఉండటం గమనార్హం. 

జోహన్నస్బర్గ్ లోని వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు భారత్ ను తక్కువ స్కోరుకే కట్టడిచేసిన సఫారీలు.. నిన్న 18 ఓవర్లు ఆడి ఒక వికెట్ మాత్రమే కోల్పోయారు. ఆట రెండో రోజు కూడా  సారథి డీన్ ఎల్గర్, యువ ఆటగాడు కీగన్ పీటర్సన్ లు సాధికారికంగానే బ్యాటింగ్ చేశారు. వీరిరువురు రెండో వికెట్ కు 74 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ 38వ ఓవర్ వేసిన ఠాకూర్.. ఆ ఓవర్ లో ఐదో బంతికి డీన్ ఎల్గర్ ను ఔట్ చేశాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని కట్ చేయబోయిన ఎల్గర్.. కీపర్ రిషభ్ పంత్ కు క్యాచ్ ఇచ్చాడు. 

 

సారథి నిష్క్రమించినా డసెన్ తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు పీటర్సన్. ఈ క్రమంలో పీటర్సన్ (118 బంతుల్లో 62) టెస్టులలో తొలి అర్థ సెంచరీ చేసుకున్నాడు. సాఫీగా సాగుతున్న పీటర్సన్ ను కూడా 42.6 ఓవర్లో ఠాకూర్ బోల్తా కొట్టించాడు. ఠాకూర్ వేసిన బంతిని స్లిప్స్ లో ఉన్న మయాంక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు పీటర్సన్. 

ఇక ఠాకూర్ తన తర్వాత ఓవర్లో డసెన్ (17 బంతుల్లో 1) ను కూడా పెవిలియన్ కు పంపాడు. దీంతో మొత్తం ఈ ఇన్నింగ్సులో మూడు వికెట్లు పడగొట్టాడు.దీంతో టీమిండియా అభిమానులంతా ఠాకూర్ ను ప్రశంసల్తో ముంచెత్తారు. ట్విట్టర్ వేదికగా ఠాకూర్ పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఇందుకు సంబంధించిన పలు మీమ్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా..  ప్రస్తుతం సఫారీలు 44.4 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేశారు. భారత్ కంటే ఇంకా వంద పరుగులు వెనుకబడి ఉంది ఆతిథ్య జట్టు. 

 

లంచ్ తర్వాత కూడా భారత బౌలర్లు విజృంభిస్తే సౌతాఫ్రికా లోయరార్డర్ ను పడగొట్టడం పెద్ద  పనేంకాదు. ప్రస్తుతం క్రీజులో టెంబ బవుమా (0 నాటౌట్), వికెట్ కీపర్ వెరెన్నే (0 నాటౌట్) ఆడుతున్నారు. వీరి తర్వాత జాన్సేన్ ఒక్కడే కాస్త బ్యాటింగ్ చేయగలడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !
Abhishek Sharma : 100 సిక్సర్లతో దుమ్మురేపిన అభిషేక్ !