IND Vs SA: రెండో రోజు భారత్ పై సౌతాఫ్రికా లీడ్.. కేఎల్‌ రాహుల్‌,ఎల్గర్‌ అద్భుత సెంచరీలు.. మ్యాచ్ హైలైట్స్‌ ఇవే

By Rajesh Karampoori  |  First Published Dec 28, 2023, 12:20 AM IST

IND vs SA 1st Test Day 2 Update: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 11 పరుగుల ఆధిక్యంతో సఫారీ జట్టు లీడ్‌లో ఉంది. కఠినమైన పరిస్థితుల్లోనూ సౌతాఫ్రికా ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ అద్భుత సెంచరీతో చెలరేగాడు. దీంతో ప్రొటిస్‌ జట్టు టీమిండియాపై పైచేయి అధిపత్యం కొనసాగిస్తోంది. 


IND vs SA Centurion Test 2nd Day: దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు టెస్టు సిరీస్ గెలవలేదన్న బాధతో టీమ్ ఇండియా ఈ పరంపరను ఛేదించడం కష్టాల్లో పడింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో రెండో రోజు ఘోరంగా వెనుకబడింది. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగుల ఆధిక్యంలో ఉండగా, ఇంకా 5 వికెట్లు మిగిలి ఉన్నాయి.

బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియా 208/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో బుధవారం నాటి ఆటను ఆరంభించింది.ఈ తరుణంలో కేఎల్‌ రాహుల్‌ టీం కు అండగా నిలిచారు. అద్భుత సెంచరీ చేశాడు. 101 పరుగుల వద్ద అతను ఔటయ్యాడు. అతని ఔట్‌తో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. రెండో రోజు ఆట ప్రారంభంలో భారత్ 8.4 ఓవర్లు మాత్రమే ఆడి 245 పరుగులకే కుప్పకూలింది. ఈ తరుణంలో సౌతాఫ్రికా పేసర్‌ కగిసో రబడ ఏకంగా ఐదు వికెట్లు దక్కించుకోగా.. అరంగేట్ర ఫాస్ట్‌బౌలర్‌ నండ్రీ బర్గర్‌ మూడు, గెరాల్డ్‌ కోయెట్జీ, మార్కో జాన్సెన్‌ తలో వికెట్‌ తీశారు. 

Latest Videos

అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆదిలోనే ఓపెనర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ వికెట్‌ కోల్పోయింది. టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు వెనుదిగాడు.  అయితే, మరో ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌, టోనీ డి జార్జిలు సఫారీ టీం కు అండగా నిలిచారు. మెరుగైన స్కోరుకు పునాది వేశాడు. 

93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి సఫారీ జట్టును మంచి స్థితిలో నిలిపారు. కానీ, వీరి భాగస్వామ్యాన్ని జస్ప్రీత్ బుమ్రా బ్రేక్ చేశారు. బుమ్రా అద్భుత బౌలింగ్‌తో తొలుత టోనీని 28 పరుగులకు.. ఆ తర్వాత అతడి స్థానంలో వచ్చిన కీగాన్‌ పీటర్సన్‌ 2 పరుగులకే వెనక్కి పంపాడు. దీంతో సౌతాఫ్రికా మరో రెండు రెండు వికెట్లు కోల్పోయింది.

ఈ ఇలాంటి కిష్ట దశలో ఎల్గర్‌కు డేవిడ్‌ బెడింగ్హామ్‌ నుంచి మంచి సహకారం అందింది.ఈ క్రమంలో ఎల్గర్‌.. 42.1 ఓవర్‌ వద్ద శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాది సెంచరీ పూర్తి చేశారు. ఇలా నాలుగో వికెట్‌కు డేవిడ్ బెడింగ్‌హామ్‌తో కలిసి 131 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమ్ ఇండియాకు సవాల్ గా నిలిచారు. మొత్తం 244 పరుగుల వద్ద డేవిడ్ (56) సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇలా ఎల్గర్‌- డేవిడ్ బెడింగ్హామ్‌ల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ పరిణామంతో రోహిత్‌ సేనకు కాస్త ఊరట లభించింది. 

ఇదే క్రమంలో సౌతాఫ్రికా మరో వికెట్ ను కొల్పోయింది. వికెట్ కీపర్ కైల్ వెరీన్ (4) ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో వెనుదిరిగాడు. దీంతో టీమిండియా ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యింది. వెరైన్‌ రూపంలో ఐదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా డ్రింక్స్‌ బ్రేక్‌(64వ ఓవర్‌) సమయానికి 254 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన మార్కో జాన్సెస్‌ వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. సెంచరీ వీరుడు ఎల్గర్‌ సైతం చాలా జాగ్రత్త ఆచితూచి ఆడాడు. 

అయితే, సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ 66వ ఓవర్‌ వద్ద వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు. ఆ తర్వాత రెండో రోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికి సౌతాఫ్రికా పదకొండు పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చేతిలో ఇంకా ఐదు వికెట్లు ఉన్నాయి. డీన్‌ ఎల్గర్‌ 140, జాన్సెన్‌ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తానికి రెండో రోజు ఆటలోనూ సౌతాఫ్రికా టీమిండియాపై ఇలా ఆధిపత్యం చాటుకుంది. వెలుతురు సరిగా లేకపోవడంతో రెండో రోజు ఆటను ముందుగానే ఆపేయాల్సి వచ్చింది. ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ 140, మార్కో యాన్సిన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇలా  రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా టీమిండియాపై ఆధిపత్యం చాటుకుంది. 

తొలిరోజు ఏం జరిగింది?

దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఆరంభం అంతా ప్రత్యేకంగా ఏమీ లేదు. కెప్టెన్ రోహిత్ ఐదు పరుగులు చేసిన తర్వాత రబడ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. దీని తర్వాత యశస్వి జైస్వాల్ 17 పరుగులు చేసి నిష్క్రమించగా, శుభమాన్ గిల్ రెండు పరుగులు చేసి నిష్క్రమించారు. ఇలా టీమిండియా 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇలాంటి పరిస్థితుల్లో శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించారు. 38 పరుగుల వద్ద విరాట్, 31 పరుగుల వద్ద శ్రేయాస్ ఔటయ్యారు. రవిచంద్రన్ అశ్విన్ 8 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 24 పరుగులను జట్టుకు అందించారు. జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక పరుగు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

click me!