
KL Rahul Hits Hundred in Centurion: సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు. వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో క్రీజులోకి వచ్చిన రాహుల్ ఒంటరి పోరాటం చేస్తూ భారత్ కు మెరుగైన స్కోర్ ను అందించడానికి ప్రయత్నిస్తున్నాడు.
భారత బ్యాటర్స్ వరుసగా ఔట్ కావడంతో కష్ట సమయంలో క్రీజులో నిలదొక్కుకుని కేఎల్ రాహుల్ రాణించాడు. ఇన్నింగ్స్ లో మరే బ్యాట్స్ మన్ 50కి మించి పరుగులు చేయని సమయంలో రాహుల్ సెంచరీ కొట్టాడు. 137 బంతుల్లో 101 పరుగులు చేశాడు.